SCR Special Trains | మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! ట్రైన్స్‌ నడిచే మార్గాలు.. తేదీల వారీగా వివరాలు ఇవే..!

SCR Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్య ప్రతి శనివారం ఆగస్ట్‌ 26 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ట్రైన్‌ నంబర్‌ 07054 బికనీర్ నుంచి కాచిగూడ మధ్య ప్రతి మంగళవారం జూలై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు నడుస్తుందని పేర్కొంది. దానాపూర్ నుంచి బెంగళూరు మధ్య (రైలు నంబర్‌ 03245) ప్రతి […]

SCR Special Trains | మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! ట్రైన్స్‌ నడిచే మార్గాలు.. తేదీల వారీగా వివరాలు ఇవే..!

SCR Special Trains |

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్య ప్రతి శనివారం ఆగస్ట్‌ 26 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ట్రైన్‌ నంబర్‌ 07054 బికనీర్ నుంచి కాచిగూడ మధ్య ప్రతి మంగళవారం జూలై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు నడుస్తుందని పేర్కొంది.

దానాపూర్ నుంచి బెంగళూరు మధ్య (రైలు నంబర్‌ 03245) ప్రతి బుధవారం ఆగస్ట్ 16 వరకు ప్రత్యేక రైలు నడస్తుందని, బెంగళూరు నుంచి దానాపూర్ మధ్య (రైలు నెంబర్ 03246) ప్రతి శుక్రవారం ఆగస్ట్ 18 వరకు నడుస్తుందని పేర్కొంది.

విశాఖపట్నం నుంచి బెంగళూరు కంటోన్మెంట్ మధ్య (రైలు నెంబర్ 08543) ప్రతి ఆదివారం జూలై 30 వరకు, బెంగళూరు కంటోన్మెంట్ నుంచి విశాఖపట్నం మధ్య ( రైలు నెంబర్ 08544) ప్రతి సోమవారం జూలై 31 వరకు స్పెషల్‌ ట్రైన్స్‌ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అలాగే కాజీపేట్ నుంచి దాదర్ మధ్య (రైలు నెంబర్ 07195) ప్రతి బుధవారం జూలై 5 నుంచి ఆగస్ట్ 30 వరకు, దాదర్ నుంచి కాజీపేట్ మధ్య (రైలు నెంబర్ 07196) ప్రతి గురువారం జూలై 6 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.

కాజీపేట్ నుంచి దాదర్ మధ్య (రైలు నెంబర్ 07197) ప్రతి శనివారం ఆగస్ట్ 26 వరకు, దాదర్ నుంచి కాజీపేట్ మధ్య (రైలు నెంబర్ 07198) ప్రతి ఆదివారం 2023 ఆగస్ట్ 27 వరకు నడుస్తాయని వివరించింది.

తిరుపతి నుంచి షిర్డీ సాయినగర్‌ మధ్య (రైలు నెంబర్ 07637) ప్రతి ఆదివారం ఆగస్ట్ 27 వరకు, షిర్డీ సాయినగర్‌ నుంచి తిరుపతి మధ్య (రైలు నెంబర్ 07638) ప్రతి సోమవారం ఆగస్ట్ 28 వరకు ప్రత్యేక రైలు నడుస్తుందని తెలిపింది.

హెచ్ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ మధ్య (రైలు నెంబర్ 07426) ప్రతి సోమవారం ఆగస్ట్ 28 వరకు, హెచ్ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ మధ్య (రైలు నెంబర్ 07427) ప్రతి మంగళవారం ఆగస్ట్ 29 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పింది.

హెచ్ఎస్ నాందేడ్ నుంచి లోకమాన్య తిలక్ టీ మధ్య (రైలు నెంబర్ 07428) ప్రతి బుధవారం జులై 5 నుంచి ఆగస్ట్ 30 వరకు.. హెచ్ఎస్ లోకమాన్య తిలక్ టీ నుంచి నాందేడ్ మధ్య (రైలు నెంబర్ 07429) ప్రతి గురువారం జులై 6 నుంచి ఆగస్ట్ 31 వరకు రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

హైదరాబాద్ నుంచి సోలాపూర్ మధ్య (రైలు నెంబర్ 07003) ప్రతి రోజూ జులై 6 నుంచి ఆగస్ట్ 31 వరకు, సోలాపూర్ నుంచి హైదరాబాద్ మధ్య (రైలు నెంబర్ 07004) ప్రతి రోజు ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.