పోలీసుల చొర‌వ.. త‌ప్పిన భారీ ప్రాణ‌న‌ష్టం

విధాత‌(విజయవాడ): పోలీస్ శాఖ స‌త్వ‌ర చ‌ర్య‌ల‌తో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 400 మంది కోవిడ్ బాధితులకు స‌కాలంలో ఆక్సిజ‌న్ అంది వారి ప్రాణాలు నిలిచాయి. ఇందుకు పోలీసులు చూపిన‌ చొర‌వ అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజయవాడ GGHలో ఆక్సిజన్‌తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ బాధితులు ఉన్నారు. ఆక్సిజ‌న్ నిల్వ‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చాయి. ఒరిస్సా నుంచి విజయవాడకు రావాల్సిన […]

  • Publish Date - May 7, 2021 / 06:07 AM IST

విధాత‌(విజయవాడ): పోలీస్ శాఖ స‌త్వ‌ర చ‌ర్య‌ల‌తో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 400 మంది కోవిడ్ బాధితులకు స‌కాలంలో ఆక్సిజ‌న్ అంది వారి ప్రాణాలు నిలిచాయి. ఇందుకు పోలీసులు చూపిన‌ చొర‌వ అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

విజయవాడ GGHలో ఆక్సిజన్‌తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ బాధితులు ఉన్నారు. ఆక్సిజ‌న్ నిల్వ‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చాయి. ఒరిస్సా నుంచి విజయవాడకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ వివ‌రాలు తెలియ‌కుండా పోయాయి.

18 టన్నులతో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయింది. ఈ విష‌యాన్ని సంబంధిత అధికారులువిజయవాడ సిటీ కమిషనర్‌కు తెలియ‌జేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సి.పి ఒరిస్సా నుంచి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గాల్లో ఉన్న ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ని గుర్తించారు.

విశ్రాంతి లేకుండా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్ల అల‌సిపోయాన‌ని ఈ కార‌ణంగా రెస్ట్ తీసుకుంటున్న‌ట్లు డ్రైవర్ పోలీసుల‌కు వివరించాడు. దీంతో ప్రత్తిపాడు సిఐ ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశాడు. డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చారు. దీంతో క‌రోనా బాధితుల‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. పోలీసుల చొర‌వ‌కు ప్ర‌తి ఒక్క‌రూ హ్యాట్సాప్‌ చెబుతున్నారు.

Latest News