ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు

విధాత‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవాడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు తెలుస్తోంది. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ […]

  • Publish Date - May 14, 2021 / 09:31 AM IST

విధాత‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవాడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు తెలుస్తోంది.

అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది.

ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఐసీఎం ఆర్ పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా.. లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది.

Latest News