సిగ్గుండాలి..వెళ్లి పడుకో.. హీరో సిద్దార్థ్ ఫైర్

సిగ్గుండాలి.. వెళ్లి పడుకో: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్దార్థ్ ఫైర్ సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఫైనాన్స్ చేస్తున్నాడన్న విష్ణు నేను అసలైన భారతీయుడినన్న సిద్ధార్థ్ సక్రమంగా ట్యాక్స్ కడుతున్నానని వ్యాఖ్య బీజేపీ నేతలపై సినీ హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తన కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన […]

  • Publish Date - May 7, 2021 / 07:46 AM IST

సిగ్గుండాలి.. వెళ్లి పడుకో: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై హీరో సిద్దార్థ్ ఫైర్

సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఫైనాన్స్ చేస్తున్నాడన్న విష్ణు

నేను అసలైన భారతీయుడినన్న సిద్ధార్థ్

సక్రమంగా ట్యాక్స్ కడుతున్నానని వ్యాఖ్య

బీజేపీ నేతలపై సినీ హీరో సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తన కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ స్పందించాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. ‘లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.