ఆ ఎస్‌ఐకీ పోలీస్ స్టేషనే బార్‌.. వైరల్‌గా వీడియోలు

కార్యాలయాన్ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌నే మందు, విందుకు అడ్డాకు మార్చుకున్న వైనం కాకినాడలో వెలుగుచూసింది

ఆ ఎస్‌ఐకీ పోలీస్ స్టేషనే బార్‌.. వైరల్‌గా వీడియోలు

విధాత: కార్యాలయాన్ని దేవాలయంగా చూడాల్సిన ఎస్‌ఐ తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌నే మందు, విందుకు అడ్డాకు మార్చుకున్న వైనం కాకినాడలో వెలుగుచూసింది. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్సై రవీంద్ర పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చేశాడు. యూనిఫాంలోనే మందు కొట్టడం.. సిగరేట్లు కాల్చడం అలవాటుగా మార్చుకున్న ఎస్సైకు సంబంధించిన అనుచిత చర్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇప్పుడు ఆ ఎస్‌ఐ అకృత్యాలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.