Srikakulam : టీచరమ్మ.. విద్యార్థుల చేత ఇవేం పాడు పనులు?
విద్యార్థుల చేతులతో కాళ్లు పట్టించుకున్న టీచరమ్మ నిర్వాకం వీడియో వైరల్‌గా మారి, ఆందోళనతో ఐటీడీఏ అధికారులు విచారణకు ఆదేశించారు.
                                    
            అమరావతి : పెన్ను, పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థుల చేతులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు నిర్వాకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి (మం), బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు దర్జాగా ఓ కుర్చీలో కూర్చుని తాను సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్ధినిలతో కాళ్లు నొక్కించుకుంటున్న దృశ్యాల వీడియో బయటకు వచ్చింది.
ఉపాధ్యాయురాలి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఈ విధంగా అనైతిక చర్యలకు పాల్పడటం ఉపాధ్యాయ వృత్తికే మచ్చ వంటిదంటూ మండిపడుతున్నారు. కాగా ఈ ఉదంతంపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందించారు. సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు.
ఉపాధ్యాయురాలి సస్పెండ్ కు ఆదేశాలు
బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలతో కాళ్లు నొక్కించుకున్న ఘటనపై ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ చర్యలు సీరియస్ గా స్పందించారు. ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
చదువు చెప్పకుండా పిల్లలతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన ఘటన https://t.co/Dm50GA8xte pic.twitter.com/IXdm1f5rng
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram