YS Jagan Convoy Accident : వైఎస్ జగన్ కాన్వాయ్ లో అక్సిడెంట్
జగన్ పర్యటనలో అపశ్రుతి.. కాన్వాయ్ వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు, ఉయ్యూరు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్‌తో రహదారులపై గందరగోళం.
                                    
            అమరావతి : కృష్ణా జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉయ్యూరులోనూ పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది.
ఈ పర్యటనకు పోలీసులు కేవలం 500 మంది మరియు 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ, జగన్‌ను కలవడానికి.. పర్యటనలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram