మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి.. చంద్ర‌బాబు

విధాత‌: కడప జిల్లా, కలసపాడు మండలం, మామిళ్లపల్లెలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందడం బాధాకర‌మ‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకర‌మ‌న్నారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల‌ని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో మైనింగ్ కు ప్రభుత్వం ఎలా […]

  • Publish Date - May 8, 2021 / 07:10 AM IST

విధాత‌: కడప జిల్లా, కలసపాడు మండలం, మామిళ్లపల్లెలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందడం బాధాకర‌మ‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకర‌మ‌న్నారు.

ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల‌ని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో మైనింగ్ కు ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్ర‌శ్నించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఎటువంటి పరిహారం ఇచ్చారో ఇక్కడ కూడా అదే విధమైన పరిహారం అందించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని, విధుల్లో ఉన్న కార్మికులకు రక్షణ కవచాలు అందించాల‌ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

Latest News