ఇంటర్ విద్యలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో పలు కీలక మార్పులు చేసింది. ఇంటర్ ఫస్టియర్ లో కూడా ఇక నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. మ్యాథ్స్‌లోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో పలు కీలక మార్పులు చేసింది. ఇంటర్ ఫస్టియర్ లో కూడా ఇక నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయించనున్నారు. మ్యాథ్స్‌లోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. మ్యాథ్స్‌లో 75కు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్కు ఫస్టియర్ లో15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు కేటాయించనున్నారు.
హ్యుమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. భాషా విభాగాల్లోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కు కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram