Tenali | ఓటరుపై దాడి చేసిన తెనాలి ఎమ్మెల్యే.. తిరిగి చెంప ఛెల్లుమనిపించిన ఓటరు.. వీడియో
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రాళ్లతో దాడులు చేసుకుంటూ హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గాయాలపాలై ఆస్పత్రుల పాలవుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూలో వెళ్లకుండా, నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న ఓటరు ఎమ్మెల్యే శివకుమార్‌ను నిలదీశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేశాడు. బాధిత ఓటరు కూడా అదే స్థాయిలో స్పందించాడు. ఎమ్మెల్యే చెంప ఛెల్లుమనిపించాడు ఓటరు. ఇక అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఒకరిని ఒకరు కొట్టుకున్న ఎమ్మెల్యే మరియు ఓటర్
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీసిన ఓటర్.
ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టాడు.. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. pic.twitter.com/6f23YW3X9c
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram