రైతులకు గిట్టుబాటుధర కూడా కల్పించలేని వైసీపీ ప్రభుత్వం,రైతుసంక్షేమ ప్రభుత్వమెలా అవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలి.

వైసీపీప్రభుత్వం రైతుదగా, రైతు ద్రోహ ప్రభుత్వమని చెప్పడానికి, రెండేళ్లపాలనే నిదర్శనం.• ముఖ్యమంత్రి విడుదలచేసిన పుస్తకంలో రైతులకు చేసిన సాయంకన్నా మోసమే ఎక్కువగా ఉంది.• రైతులకు, వ్యవసాయానికి చేసిన సాయంపై అన్నీ దొంగలెక్కలే చెప్పారు.• జగన్ రెండేళ్లపాలనలో ఏడుసార్లు తుఫాన్లు వచ్చాయి. ఇక అకాలవర్షాలు సరేసరి.• వాటివల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా రూపంలో జగన్ ప్రభుత్వం ఎంతసాయం చేసింది?• చంద్రబాబు హాయాంలో హెక్టారుకి రూ.20వేలిస్తే, జగన్ దాన్ని రూ.16వేలకుకుదించాడు.• రైతుభరోసా కింద ప్రతిరైతుకి రూ.13,500ఇస్తాననిచెప్పి, […]

  • Publish Date - June 4, 2021 / 11:33 AM IST

వైసీపీప్రభుత్వం రైతుదగా, రైతు ద్రోహ ప్రభుత్వమని చెప్పడానికి, రెండేళ్లపాలనే నిదర్శనం.
• ముఖ్యమంత్రి విడుదలచేసిన పుస్తకంలో రైతులకు చేసిన సాయంకన్నా మోసమే ఎక్కువగా ఉంది.
• రైతులకు, వ్యవసాయానికి చేసిన సాయంపై అన్నీ దొంగలెక్కలే చెప్పారు.
• జగన్ రెండేళ్లపాలనలో ఏడుసార్లు తుఫాన్లు వచ్చాయి. ఇక అకాలవర్షాలు సరేసరి.
• వాటివల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా రూపంలో జగన్ ప్రభుత్వం ఎంతసాయం చేసింది?
• చంద్రబాబు హాయాంలో హెక్టారుకి రూ.20వేలిస్తే, జగన్ దాన్ని రూ.16వేలకుకుదించాడు.
• రైతుభరోసా కింద ప్రతిరైతుకి రూ.13,500ఇస్తాననిచెప్పి, రూ.7,500లతో సరిపెట్టాడు.
• రైతుభరోసా చెల్లింపులో రైతులసంఖ్యను కూడా ఈముఖ్యమంత్రి 64లక్షలనుంచి 41లక్షలకు కుదించాడు.
• ఇక యాంత్రీకరణపరికరాలు, సూక్ష్మపోషకాలు, భూసారపరీక్షలనేవి ఈప్రభుత్వంలో ఎక్కడా కనిపించడంలేదు.
• ముఖ్యమంత్రి చెప్పిన రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?
• వరి, పత్తి, మిర్చిసహా, ఏఒక్క పంటకైనా వైసీపీప్రభుత్వంలో గిట్టుబాటుధర లభించిందా?
• ఒక్క జిల్లాలోనే ధాన్యం రైతులకురూ.1200కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
• పోలవరం ఎత్తుని 150 అడుగులనుంచి 135 అడుగులకు తగ్గించడం రైతులకు మేలుచేయడమా?
• పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిచెప్పాడని పోలవరం ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి బ్యారేజీగా మార్చేశాడు.
• తన క్విడ్ ప్రోకోకోసమే అమూల్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకొచ్చాడు.
• అన్నిడెయిరీలకంటే లీటర్ పాలకు అమూల్ సంస్థ తక్కువధర చెల్లిస్తున్నా, ముఖ్యమంత్రి పాలు వారికే పోయాలంటున్నాడు.
• ఈ విధంగా అన్నిరకాలుగా రైతులను మోసగించిన జగన్మోహన్ రెడ్డి పుస్తకాల్లో అన్నదాతలను ఉద్ధరించాననడం సిగ్గుచేటు.

తన రెండుసంవత్సరాల పాలనపై ముఖ్యమంత్రి విడుదల చేసిన పుస్తకంలో ఆయన రైతులకు చేసిన సాయం కన్నా, మోసమే ఎక్కువకనిపిస్తోందని , పుస్తకంలో అన్నీ దొంగ లెక్కలే ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మలరామానాయుడు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

రైతులకు చేసినసాయంపై ముఖ్యమంత్రి చెప్పినలెక్కలకు, వారికి అందిన సాయానికి ఎక్కడా పొంతనలేదు. వ్యవసా యానికి, రైతాంగానికి సంబంధించి తానుసూటిగా అడిగే 15 అంశాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అన్న దాతల తరుపున డిమాండ్ చేస్తున్నా.
విభజనతర్వాల ఏర్పడిన రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయరం గంపైనే ఆధారపడింది. కానీ జగన్ రెండేళ్లపాలనలో రైతుల కుచేసిన సాయం గోరంత, చేసుకుంటున్న ప్రచారం కొండంత . రెండేళ్ల జగన్మోహన్ రెడ్డిపాలనలో ఏడుతుఫాన్లు, అకాల వర్షాలతో రైతులు పంటనష్టపోయారు. ఆ విధంగా నష్టపోయి రైతులకు, ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టపరిహారం సకాలంలో చెల్లించాలి. చంద్రబాబునాయుడి హాయాంలో హెక్టారుకి రూ.20వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ అందించడం జరిగిం ది. కానీ వైసీపీప్రభుత్వం దాన్ని హెక్టారుకి రూ.16వేలకే పరి మితంచేసింది. అదికూడా రాష్ట్రవ్యాప్తంగా రైతులు 37లక్షల ఎకరాల్లో పంటనష్టపోతే, కేవలం 11లక్షలఎకరాలకే రూ.16వే లఇన్ పుట్ సబ్సిడీని అందించారు. అలా చేసిన జగన్మోహ న్ రెడ్డిప్రభుత్వం రైతుసంక్షేమ ప్రభుత్వమా..లేక రైతుదగా ప్రభుత్వమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.

రెండో అంశం పంటలబీమా. రైతు బ్రతకడానికి పంటలకు బీమా చాలా అవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి రైతులవాటా ను, ప్రభుత్వవాటాను తానే కడతాననిచెప్పి, మోసగించాడు. ప్రభుత్వం పంటలబీమా సొమ్ముని చెల్లించకపోవడంపై చంద్ర బాబునాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తంచేసి, అసెంబ్లీలోనేలపై కూర్చున్నాడు. పరువుపోతోందన్న భయంతో అర్థరాత్రి అరకొరగా రూ.590కోట్లువిడుదలచేస్తూ, జగన్ ప్రభుత్వం జీవోఇచ్చింది. పంటలబీమా కట్టకపోవడం అంటే రైతులను మర్చిపోవడమే. రైతులను మర్చిపోయిన ప్రభుత్వం రైతు దగా ప్రభుత్వంకాక ఏమవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలి.
రైతుభరోసా పథకంపై పాదయాత్రసమయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రమిచ్చే సొమ్ముతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతిరైతుకి రూ.13,500 ఇస్తానన్నా డు. జగన్ అధికారంలోకి వస్తే తమకు రూ.13,500వస్తాయ ని, కేంద్రప్రభుత్వమిచ్చే సొమ్ముతో కలిపి తమకు రూ.20వే లు వస్తాయని రైతులంతా ఆశపడి, జగన్ కుఓటేశారు.
కానీ అధికారంలోకి వచ్చాక జగన్ మాటతప్పాడు. ఒక్కో రైతుకి రూ.7,500మాత్రమే చెల్లించాడు. జగన్ నిర్వాకంతో ఒక్కో రైతు రూ.6వేలచొప్పున ఐదేళ్లలో రూ.30వేలునష్ట పో తున్నాడు. రైతుభరోసా కింద ఇస్తామన్న సొమ్ములోకోత పెట్టడంతోపాటు, రైతులసంఖ్యనుకూడా జగన్ ప్రభుత్వం కుదించింది. ఆ విధంగా రైతులను దగాచేసిన ఈప్రభుత్వం రైతులకు న్యాయంచేస్తోందని ఈముఖ్యమంత్రి ఎలా చెబుతా డు? దీనిపై కూడా ముఖ్యమంత్రి ప్రజలముందుకొచ్చి సమా ధానంచెప్పాలి.

వ్యవసాయమంత్రి అసెంబ్లీలో వ్యవసాయబడ్జెట్ సమావేశం లో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 64లక్షలమంది రైతులకు రైతుభరోసా ఇస్తామనిచెప్పారు. అర్థంలేనినిబంధనలు పెట్టి, రైతులసంఖ్యను ఈప్రభుత్వం 45లక్షలకుకుదించింది. దాని పై ముఖ్యమంత్రి ఏంచెబుతారు?
కౌలురైతులకు రైతుభరోసాలో ఎందుకు మొండిచెయ్యి చూపారు? 15లక్షలమంది కౌలురైతులకు రైతుభరోసా ఇస్తా మని, ఇదే వ్యవసాయమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. కానీ సాయంఅందించేసమయానికి వారి సంఖ్యను కేవలం 41వేల కే పరిమితంచేశారు. 15లక్షలమంది 41వేలుగా ఎలా మారా రో, కౌలురైతులను అంతదారుణంగా ఎందుకు మోసగించా రో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి.

కౌలురైతులనుకూడా వర్గాలు, మతాలుగా విభజించారు. ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు రైతుభరోసా సాయంలో దారుణంగా అన్యాయంచేసింది నిజంకాదా? దానిపై ముఖ్య మంత్రి ఏంచెబుతాడు?
అత్యధికంగా వరిపండే జిల్లాలైన ఉభయగోదావరి జిల్లాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు సకాలంలో బకాయిలు అం దలేదు. ధాన్యంఅమ్ముకున్న రైతులకు, రెండునెలలైనా కూడా ఇంతవరకు ఒక్కజిల్లాలోనే రూ.1200కోట్లవరకు చెల్లించాల్సి ఉంది. ధాన్యం బకాయిలు సకాలంలోచెల్లించలేని ప్రభుత్వం రైతుదగా ప్రభుత్వం కాకఏమవుతుంది?
ఇక ఎనిమిదో అంశమేమిటంటే యాంత్రీకరణ. వ్యవసాయ యాంత్రీకరణనుప్రోత్సహించడానికి చంద్రబాబుప్రభుత్వం విశే షంగా కృషిచేసింది. 50 నుంచి 75శాతం సబ్సిడీపై రైతుల కు వ్యవసాయయాంత్రీకరణ పరికరాలు అందించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా సరే, ఒకట్రాక్టర్, టిల్లర్, వరికోతయంత్రం లాంటివి అందించారా? ఆఖరికి గడ్డపార వంటివికూడా ఇవ్వలేకపోయారు.

రాయలసీమ,ఇతర మెట్టప్రాంతాల్లో వ్యవసాయానికి వరప్రసా దిని డ్రిప్ ఇరిగేషన్. టీడీపీప్రభుత్వం 90శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను, సన్నచిన్నకారు రైతులకు 100శాతం సబ్సిడీపై అందించింది. జగన్ తనరెండేళ్లపాలన లోఎక్కడైనా సరే, ఒక్కరైతుకైనా డ్రిప్ పరికరాలు అందించా డా? దానిపై ఈ ముఖ్యమంత్రి ఏం చెబుతాడు?
పెట్టుబడులు తగ్గించి, దిగుబడిపెంచాలనే సదుద్దేశంతో 100శాతం సబ్సిడీపై టీడీపీప్రభుత్వంలో సూక్ష్మపోషకాలు అందించడం జరిగింది. ఈప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా ఒక కేజీఅయినా సూక్ష్మపోషకాలు, ఎరువులు అందించారా?
మత్స్యరంగానికి, మత్స్యకారులకు ఈప్రభుత్వం ఏంచేసింది? దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా నిలపాలన్న లక్ష్యంతో ఆక్వారంగానికి చంద్రబాబునాయుడి హాయాంలో 50శాతం సబ్సిడీపై మోటార్లు, బోర్లు,ఏరియేటర్లు అందించడం జరిగిం ది. జగన్ ప్రభుత్వం ఒక్కశాతమైనాసబ్సిడీ ఇచ్చిందా? దానికి తోడు విపరీతంగా విద్యుత్ ధరలు పెంచేశారు. నెలకు రూ.5వేలు, ఆపైన విద్యుత్ బిల్లులుకడుతున్నామని, దాదాపు రూ.2వేలపైన డీజిల్ కు ఖర్చవుతోందని ఆక్వా రైతులు వాపోతున్నారు. కోవిడ్ కారణంగా చేపలు, రొయ్యల కు గిరాకీ తగ్గింది. ఆ విధంగా అన్నివిధాలా నష్టపోతున్న ఆక్వా రైతులకు ఈముఖ్యమంత్రి తన రెండేళ్లపాలనలో ఏంసాయంచేశాడో సమాధానంచెప్పాలి?
మెట్టప్రాంతరైతాంగానికి అందించే ఉచిత విద్యుత్ విషయం లో జగన్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూస్తోంది. జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ మోటార్లకు మీటర్లుబిగించాలని నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మోటార్ల కు మీటర్లు బిగించడమంటే రైతులమెడకు ఉరితాళ్లు బిగించ డమే అవుతుంది. అలాంటిపనికి పూనుకున్న ఈ ప్రభుత్వ రైతుసంక్షేమ ప్రభుత్వమా..లేక రైతు దగాప్రభుత్వమా?
ధరలస్థిరికరణ నిధిఏర్పాటుచేశామని ఘనంగా చెప్పుకుం టున్నారు. పత్తి, మిరప, వరి, పసుపు, సుబాబుల్, మొక్క జొన్న, టమాటా, కంది, మినుము, చెరకు, ఇలా ఏపంటకై నా సరే గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా? ముఖ్యమంత్రి చెప్పిన ధరలస్థిరీకరణ నిధిఏమైంది? చంద్రబాబునాయుడి హాయాంలో రైతులకు రూ.3లక్షలవరకు సున్నావడ్డీ నిబం ధన అమలైంది. ఈప్రభుత్వం దాన్ని కేవలం రూ.లక్షకే పరి మితంచేసింది. రైతులకు గిట్టుబాటుధర కల్పించలేని ప్రభు త్వం రైతుఅనుకూలప్రభుత్వమెలా అవుతుందో ముఖ్య మంత్రి సమాధానంచెప్పాలి.

పశ్చిమగోదావరిజిల్లాలో అమూల్ కి సంబంధించిన కార్య క్రమాన్ని నేడుముఖ్యమంత్రి ప్రారంభించారు. తన క్విడ్ ప్రోకో వ్యాపారానికి సంబంధించే జగన్, ఏపీకి అమూల్ సంస్థను తీసుకొచ్చాడు. ఏపీప్రజలు పన్నులరూపంలోకట్టే సొమ్ముని అమూల్ కి దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి తహతహలాడుతు న్నాడు. ఇతర డెయిరీలతోపోలిస్తే, పాడిరైతులకు అమూల్ చెల్లించే ధర లీటర్ పై తక్కువఉన్నాకూడా, అమూల్ సంస్థకే పాలుపోయాలనే నిబంధనను ముఖ్యమంత్రి ఎందుకు పెడు తున్నాడు? అమూల్ కి పాలుపోస్తేనే పింఛన్లు, రేషన్ ఇస్తా మని గ్రామాల్లో బెదిరిస్తున్నమాట నిజంకాదా? అమూల్ ను బాగుచేస్తూ, పాడిరైతులను దోచుకుంటున్న వైసీపీప్రభుత్వం రైతుదగా ప్రభుత్వమా…లేక రైతుసంక్షేమ ప్రభుత్వమా?
ఇక చివరి అంశమేమిటంటే పోలవరం నిర్మాణం. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. తాగు,సాగునీటి సమస్యపరిష్కారానికి ఏకైక వరప్రదాయిని. అటువంటి జాతీయప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి తన స్వప్రయోజ నాలకోసం పిల్లకాలువగా మార్చాలని చూస్తున్నది నిజం కాదా? రాష్ట్రప్రయోజనాలను, రైతాంగం ప్రయోజనాలను పొరుగురాష్ట్రానికి తాకట్టుపెట్టే అధికారం, హక్కుఈ ముఖ్య మంత్రికి ఎవరిచ్చారు. ప్రాజెక్ట్ లో నీటినిల్వసామర్థ్యం ఎత్తుని 150 అడుగులనుంచి 135 అడుగులకు తగ్గించడంద్వారా, ముంపు ప్రాంతాన్ని కుదించడంద్వారా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.35వేలకోట్లనుంచి రూ.20వేలకోట్లకు తగ్గింది. దాదాపు రూ.15వేలకోట్లకోసం పోలవరం అర్థం, పరమార్థా న్నే ముఖ్యమంత్రి మార్చేశాడు. పోలవరం ఎత్తుతగ్గిస్తే, ఉత్త రాంధ్రలోని సుజలస్రవంతికి నీరివ్వడం, విశాఖపట్నానికి తాగునీరు అందించడంనిలిచిపోతుంది. దానితోపాటు, కృష్ణా డెల్టాకు, పల్నాడుకు, శ్రీశైలంనుంచి రాయలసీమకు నీటి తరలింపును ముఖ్యమంత్రి అడ్డుకున్నాడనేది ఎవరూ కాద నలేని వాస్తవం. పోలవరం నీటినిల్వ సామర్థ్యాన్ని తగ్గించ డంద్వారా పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలను జగన్మో హన్ రెడ్డి అంగీకరించాడన్నది నిజంకాదా? ఆయనెవరో చెబి తే ఈముఖ్యమంత్రి పోలవరంప్రాజెక్ట్ ని బ్యారేజీగా ఎలా మారుస్తాడు. ఇంతటి మోసంచేస్తూ, రైతులకు తీరని అన్యా యంచేసిన జగన్మోహన్ రెడ్డి, రెండేళ్లలోరైతులను ఉద్ధరించా నని చెప్పుకోవడం ముమ్మాటికీ పచ్చిఅబద్ధం. పెద్దమోసమే . కాబట్టి ముఖ్యమంత్రి తాను అడిగిన అన్ని అంశాలపై తక్ష ణమే ప్రజలముందుకొచ్చి సమాధానంచెప్పాలి. రైతాంగం కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోవడానికి ముఖ్యమంత్రి అనాలో చిత నిర్ణయాలే కారణం. దేశంలోనే మనరాష్ట్రం కౌలురైతుల ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉందంటే అందుకుకారణం జగన్మోహన్ రెడ్డే. అటువంటి వ్యక్తికి ఇంకా పదవిలోకొనసాగే నైతిక అర్హతలేదని స్పష్టంచేస్తున్నాం.