సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్
విధాత:సీఎం జగన్ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలి.లేఖలు రాసినంతా మాత్రనా ప్రధాని స్పందించడు.భార్యను విడిచిపెట్టిన మోదీ మీరు రాసే ప్రేమలేఖలుకు ఎలా స్పందిస్తాడు.జగన్ విశాఖ రాజదాని అంటున్నాడు స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇంకా రాజదానికీ ఎం అందం ఉంటుంది.
బోడి గుండుకు మల్లే పూలు ఎందుకు జడకు మల్లేపూలు పెట్టుకోవాలి.ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ అయితే రాజధాని వచ్చి ఏం లాభం.మిజోరం గవర్నర్ గా హరిబాబు నియామకం అయితే సంభరాలు చేస్తున్నారు.
ఇక్కడ హరిబాబు పాపం చేస్తే మిజోరం లో పుణ్యం వస్తుందా .విశాఖ లో పుట్టి విశాఖ లో ఎదిగి ఉన్నతంగా నిలబెట్టిన విశాఖ లో స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంటే హరిబాబు ఎందుకు స్పందించడు.నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్ పదవి తిరస్కరించాలి.స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయ్యాలి వేంకయ్యనాయుడు ఇప్పటికైన నోరు తెరవండి. స్టీల్ ప్లాంట్ కోసం మీరు పోరాటం చేసారు అది గుర్తుకు రావడం లేదా మోదీ ప్రభుత్వం దేశాన్నే అమ్మేస్తుంది.విజయసాయి రెడ్డి కి ప్రధాని వద్ద మంచి పలుకుబడి ఉంది.
ఆయన తలచుకుంటే ఈ సమస్య పరిష్కారించగలడు.అధికార వైసీపీ పార్టీ కి స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ది లేదు.తమిళనాడు లో కేంద్రం నిర్ణయాలు విరుద్దంగా ఉంటే ప్రభుత్వ మే సంపూర్ణ బంద్ చేస్తుంది.మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.చంద్రబాబు,సీఎం జగన్ ఇద్దరు ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని ముందే చెప్పాను.ఈ నెల 12న విజయవాడలో అఖిల పక్షల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తాం.రాష్ట్ర వ్యాప్తి ఉద్యమ కార్యాచరణ రూపోందిస్తాం.