ప్రాణం తీసిన సెల్ఫీ మోజు కాలుజారి సముద్రంలో కొట్టుకపోయిన ఇద్దరు యువతులు
సెల్ఫీ మోజు మరో ఇద్దరి ప్రాణాలు బలిగొంది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి సముద్రంలో ఇద్దరు యువతులు సముద్రంలో కొట్టుకపోయారు.

విధాత : సెల్ఫీ మోజు మరో ఇద్దరి ప్రాణాలు బలిగొంది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి సముద్రంలో ఇద్దరు యువతులు సముద్రంలో కొట్టుకపోయారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ఆదివారం సెల్ఫీ దిగుతున్న క్రమంలో కాలుజారి ముగ్గురు యువతులు సముద్రంలో పడిపోయారు. సముద్రంలో కొట్టుకపోతున్న వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు కాపడటానికి ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు. మరొకరి పరిస్థతి పరిస్థితి విషమంగా ఉంది. మృతిచెందిన ఇద్దరు యువతులు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నూక రత్నం, కనకదుర్గలుగా గుర్తించారు.