పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు

విధాత‌: భగత్‌సింగ్‌ నగర్‌లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు.1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని.. పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. […]

పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు

విధాత‌: భగత్‌సింగ్‌ నగర్‌లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు.1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని.. పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్‌ పాలనాదక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు.

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని మంత్రి అనిల్‌ అన్నారు