బెజవాడలో బడాబాబుల కొడుకులు థార్ కార్లతో పరస్పరం ఢీ కొట్టుకుంటూ నడి రోడ్డుపై సృష్టించిన బీభత్సం వైరల్ గా మారింది. విజయవాడలో 100 అడుగుల రోడ్డులో ఇద్దరు యువకులు ఒకరి కారుని మరొకరు గుద్దుకుంటూ.. రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చూపించుకున్నారు. వారి ఘర్షణ చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఇంజనీరింగ్ విద్యార్థి లింగమనేని రోహిత్ , రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు యువకులు ఒక అమ్మాయి విషయంలో చెలరేగిన గొడవ నేపథ్యంలో నడిరోడ్డుపై తమ థార్ కార్లతో ఘర్షణకు దిగారు. పరస్పరం ఇనుప రాడ్లతో కార్ల అద్దాలు ధ్వంసం చేసుకున్నారు. గొడవకు దిగిన వారిలో ‘బొల్లా ఓమ్’ అనే యువకుడిని పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవకు కారణమైన ‘లింగమనేని రోహిత్’ అనే మరో యువకుడు పరారీలో ఉన్నాడు. రోడ్డుపై ఈ హైడ్రామా జరుగుతున్న సమయంలో సదరు యువతి కూడా అక్కడే ఒకరి కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఓ అమ్మాయి కోసం నడిరోడ్డుపై న్యూసెన్స్ చేస్తూ ప్రయాణికులకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గించేలా వ్యవహరించిన యువకుల చర్యపై స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వాళ్ల విషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించి వారి బెండు తీయాలని నెటిజన్లుడిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ ధనిక వర్గాల పిల్లలకు చెందిన వాళ్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు రావడం..నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు..ఎంపీ తెలుసు ఆ మంత్రి తెలుసు అంటూ లాబీయింగ్ చేసి వారిని బయటకు తీసుకెళ్లిపోతారని..అలాంటి వాటికి పోలీసులు లొంగిపోవద్దని సూచిస్తున్నారు.
చట్టం అంటే భయం..సామాజిక బాధ్యత లేని బడా బాబుల కొడుకును వదిలేస్తే.. మళ్లీ యధావిధిగా కార్లు, బీర్లలో రూడ్లపై ఆంబోతుల మాదిరిగా రచ్చ చేస్తారని…పోలీసులు వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని వ్యవస్థలపై జనంలో నమ్మకం నిలుపాలని నెటిజన్లు కోరుతున్నారు. డబ్బు ఉంది కదా అని తల్లిదండ్రులు 18ఏళ్ల వయసు పిల్లలకు కార్లు కొనిచ్చి…బాధ్యత లేకుండా పెంచితే పరిణామాలు ఇలాగే ఉంటాయని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పటమట పోలీస్ స్టేషన్ సీఐ పవన్ కిషోర్ పేర్కొన్నారు.
బెజవాడలో బాగా బలిసిన బడాబాబుల కొడుకులు ఇలా రోడ్డు మీద థార్ కార్లతో గుద్దుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు .. ఒకరి కార్ ని మరొకరు రాడ్లతో అద్దాలు పగుల గొట్టుకుంటూ రౌడీయిజం చేసారు .. లింగమనేని రోహిత్ , బొల్లా ఓమ్ అనే ఈ ఇద్దరు తిన్నది అరగక ఇలా కొట్టుకున్నారు .. ఒక అమ్మాయి… pic.twitter.com/JiFbJaEwZM
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) May 22, 2026
ఇవి కూడా చదవండి :
హైదరాబాద్ టాప్-2లో ఉండాలంటే.. బెంగళూరుపై ఎలా గెలవాలి? సమీకరణాలు ఇలా..!
Accreditation Cards | అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
