ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై దాడులను ఖండిస్తున్నాం
విధాత: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు భౌతికంగా దాడులకు పాల్పడటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడటం దుష్ట సాంప్రదాయానికి నిదర్శనం.రాడ్లు, కర్రలతో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం, విశాఖలోని టిడిపి కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా విజయవాడ, హిందూపురంలో టిడిపి నాయకుల ఇళ్ల పై దాడులకు పాల్పడటం దుర్మార్గం. గతంలో ఎన్నడూ లేని […]

విధాత: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణులు భౌతికంగా దాడులకు పాల్పడటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడటం దుష్ట సాంప్రదాయానికి నిదర్శనం.రాడ్లు, కర్రలతో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం, విశాఖలోని టిడిపి కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా విజయవాడ, హిందూపురంలో టిడిపి నాయకుల ఇళ్ల పై దాడులకు పాల్పడటం దుర్మార్గం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీపై ఇటువంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.రాజకీయాల్లో విమర్శలు రాజకీయంగా ఉండాలేగాని వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులు సరికాదు.ప్రజాస్వామిక వ్యవస్థకు ఇటువంటి ఘటనలు పెను విఘాతం.పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాల్సిన తరుణమిది.ప్రజాతంత్ర వాదులంతా ఈ దాడులను ఖండించాలని కోరుతున్నాం.
టిడిపి ఆఫీసులపై, నాయకుల ఇళ్ల పై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ,