కోవిడ్ పై యుద్ధం చేస్తున్నాం

'నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి''ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించండి':జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విధాత అనంతపురము, మే 11 : కోవిడ్ పై యుద్ధం చేస్తున్నామని, నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించి ఈ యుద్ధంలో ప్రజలను గెలిపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడీసీసీ బ్యాంకులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నందు ఆక్సిజన్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు, […]

  • Publish Date - May 12, 2021 / 02:46 AM IST

‘నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి’
‘ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించండి’:జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

విధాత అనంతపురము, మే 11 : కోవిడ్ పై యుద్ధం చేస్తున్నామని, నోడల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించి ఈ యుద్ధంలో ప్రజలను గెలిపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏడీసీసీ బ్యాంకులోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నందు ఆక్సిజన్ సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమీక్ష నిర్వహించారు.

ఆసుపత్రుల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. టెక్నికల్ అంశాల గురించి పూర్తి అవగాహన కలిగివుండి అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విపత్తు సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత నోడల్ ఆఫీసర్ల మీద ఉందని గుర్తుంచుకోవాలన్నారు.

నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ప్రతి రోజూ ఉదయం ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించుకుని ఆరోజు విధులను వివరించాలన్నారు. ఎప్పటికప్పుడు కరోనా గురించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఐదు గంటలకోసారి ఆసుపత్రిలను సందర్శించి సిబ్బంది విధులను సమీక్షించాలన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిని వెంట వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండ్లకు ఆదేశించారు. ఆక్సిజన్ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సర్వజన, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లను జిల్లా కలెక్టర్ అదేశించారు.

అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకునేందుకు అవసరమైన కూలీలను నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారికి వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ను ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గరనుంచి అవసరమైనప్పుడు తెచ్చుకునేందుకు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకోవాలని సూచించారు.

జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వెంటిలేటర్లన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ వృథాను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మానిటరింగ్ టీములు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల సహాయకులు ఎక్కువగా ఉంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. సహాయకుల సంఖ్య నియంత్రించాలని అదేశించారు.

మెరుగైన వైద్య సేవలందించండి: ఎంపీ తలారి రంగయ్య
సమావేశంలో ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు నోడల్ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరా వినియోగంపై నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వార్డులను సందర్శించి కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపాలన్నారు.

ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత మందికి ఎంత సమయం పాటు అందించగలం, తిరిగి ఖాళీ ఆక్సిజన్ ప్లాంట్లు నింపేందుకు ట్యాంకులు ఏ సమయానికి చేరుకోగలవో నిరంతరం సమీక్షించుకుంటూ ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

సమావేశంలో డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సర్వజన/సూపర్ స్పెషాలిటీ/క్యాన్సర్ ఆసుపత్రుల నోడల్ ఆఫీసర్లు మరియి సూపరింటెండెంట్లు, డ్రగ్స్ ఏడీ రమేశ్ రెడ్డి, ఏపీ ఎస్ఎమ్ ఐడీసీ ఇంజినీర్లు, ఆనంతపురము ఆర్డిఓ గుణభూషణ్ రెడ్డి, డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు.

Latest News