రాష్ట్రంలో రోజుకు రూ.2కోట్లపైనే దోపిడీ…

విధాత‌: పెట్రోల్‌ మోసాలపై తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబరు 18004254202ను అందుబాటులోకి తెచ్చింది.ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు చేసేందుకు clm&≈@nic.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. చిప్‌లు అమర్చడం ద్వారా 10 లీటర్ల పెట్రోల్‌కు అర లీటరు నుంచి లీటరున్నరవరకు దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. పెట్రోల్‌కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి 10 లీటర్లకు 50ఎంఎల్‌ వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు. కాగా చిప్‌లు అమర్చిన బంకుల్లో 10 లీటర్లకు అర లీటరు నుంచి లీటరున్నర […]

రాష్ట్రంలో రోజుకు రూ.2కోట్లపైనే దోపిడీ…

విధాత‌: పెట్రోల్‌ మోసాలపై తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబరు 18004254202ను అందుబాటులోకి తెచ్చింది.ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు చేసేందుకు clm&≈@nic.in వెబ్‌సైట్‌ను రూపొందించింది.

చిప్‌లు అమర్చడం ద్వారా 10 లీటర్ల పెట్రోల్‌కు అర లీటరు నుంచి లీటరున్నరవరకు దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. పెట్రోల్‌కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి 10 లీటర్లకు 50ఎంఎల్‌ వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు. కాగా చిప్‌లు అమర్చిన బంకుల్లో 10 లీటర్లకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు తక్కువ కొలుస్తున్నారు. ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎక్కువగా 10 లీటర్లకు లీటరు వరకు మోసానికి పాల్పడుతున్నారు. సాధారణంగా ఏకకాలంలో పెద్ద సంఖ్యలో బంకులపై దాడులు నిర్వహిస్తే 5శాతం బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్టు గత రికార్డులు తెలుపుతున్నాయి.

మన రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3,878 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వాటిలో పెట్రోల్‌ విక్రయించే పెట్రోల్‌ యూనిట్లు దాదాపు 15వేలు ఉన్నాయి.రోజుకు దాదాపు 1.20 కోట్ల లీటర్ల పెట్రోల్, 2.70కోట్ల లీటర్ల డీజిల్‌ విక్రయిస్తున్నారు. అంటే మొత్తం దాదాపు 4కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు అమ్ముతున్నారు. సగటున 200 పెట్రోల్‌ బంకుల్లో మోసం చేస్తున్నారని భావించినా సరే వాటిలో మొత్తం మీద రోజుకు 20.63 లక్షల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.చిప్‌లు అమరిస్తే పది లీటర్లకు సగటున లీటరు మోసం చేస్తున్నారని లెక్కించినా సరే … 20.63లక్షల లీటర్లకు 2.06లక్షల లీటర్లు మోసం చేస్తున్నట్టు.ప్రస్తుత ధర ప్రకారం లీటరుకు సగటున రూ.100 ధర వేసుకున్నా సరే రోజుకు రూ.2.06కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో అంచనా ఇలా ఉంటే ఇక దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పెట్రోల్‌ బంకుల్లో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారో ఊహించవచ్చు.