నామినేటెడ్ పదవులలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది?
పూలే-అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు అత్తిలి రాజు పూలే ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.! విధాత:వై.సి.పి ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవులలో సామాజిక న్యాయం ఎక్కడుందని అత్తిలి రాజు పూలే ప్రశ్నించారు.ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ రాష్ట్రంలో 85 శాతం ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ లకు 56శాతం,మిగతా వారికి 44శాతం ఇదేనా పారదర్శకత పాలన అంటే,ఇందులో ఎక్కడ కనిపిస్తుంది సామాజిక న్యాయం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధులు, నిధులు లేని నామినేటెడ్ పదవులను బహుజనల […]
పూలే-అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు అత్తిలి రాజు పూలే ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.!
విధాత:వై.సి.పి ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవులలో సామాజిక న్యాయం ఎక్కడుందని అత్తిలి రాజు పూలే ప్రశ్నించారు.ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ రాష్ట్రంలో 85 శాతం ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ లకు 56శాతం,మిగతా వారికి 44శాతం ఇదేనా పారదర్శకత పాలన అంటే,ఇందులో ఎక్కడ కనిపిస్తుంది సామాజిక న్యాయం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధులు, నిధులు లేని నామినేటెడ్ పదవులను బహుజనల కు కేటాయించడం జరిగింది.యస్టీ ల కు అయితే కనీసం ఒక్క నామినేటెడ్ పదవి కూడ ఇవ్వకుండా వై.సి.పి ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించామని చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని అని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని రజక గంగిరెద్దుల,జంగాల, భట్ట రాజులు, మేధర,నాయీబ్రాహ్మణ,కర్ణభక్తులు,గౌడు(మన్యం),యాత,సగర,వడ్డెర,విశ్వబ్రాహ్మణ,దేవంగా,కుమ్మర,కమ్మర,మాదాసి రెల్లి,బెస్త,దూదేకుల,వాడబలిజ, తొగట,నాయక్, లంబాడీ, తాండా మరియు అనేక ఇతర అనేక బహుజన కులాల కు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా చట్టసభల్లో ఇప్పటికే ఉన్న సంపన్నసామాజిక వర్గల కు ప్రాధాన్యత ఇవ్వడం, పవర్ ఉన్న నామినేటెడ్ పదువులు కేటాయించుకోవాడం వలన బహుజన ప్రజలకు ఏవిధమైన న్యాయం అందించగలిగారు అనే విషయం ఆత్మవిమర్శ చేసుకోవాలి.రాష్ట్రంలో,దేశంలో ఉన్న ప్రతి కులానికి చట్టసభల్లో రిప్రజెంటేషన్ ఉండాలి, అలా లేని కులం, జాతి అంతరించి పోతుంది అని ఆనాడే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ .అంబెడ్కర్ చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇలా చేస్తేనే ప్రక్కన కూర్చోబెట్టి మీకు 151 ఎమ్మెల్యే స్థానలు గెలిపించడనికి బహుజనులు 90 శాతం కారకులని వైసిపి ప్రభుత్వం పెద్దలు మరవకూడదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూలే- అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర యువజన అధ్యక్షులు అత్తిలి రాజు ఫూలే తెలియజేసారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram