YS Jagan : గోబెల్స్ కు చంద్రబాబు టీచర్
చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్.. గోబెల్స్‌కు చంద్రబాబే టీచర్ అంటూ తీవ్ర విమర్శలు. రైతుల పరిస్థితిపై దుయ్యబట్టి అవినీతి కేసులపై ప్రశ్నలు సంధించారు.
అమరావతి : టీడీపీ ఎన్నికల హామీలు సూపర్-6 సూపర్‌హిట్ అని ప్రచారం చేసుకుంటు సీఎం చంద్రబాబును చూసి.. గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలని..గోబెల్స్‌కు చంద్రబాబే టీచర్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని ఇవ్వలేదని, రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారని.. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా? అని జగన్ నిలదీశారు. గురువారం తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని ..ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
వ్యవసాయం మళ్లీ దండగలా మార్చారు
పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో మళ్లీ దండగలా మారిందని జగన్ విమర్శించారు. మొంథా తుపాను పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్‌ఇచ్చాడని ఎద్దేవా చేశారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం.. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్‌ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తడం లేదన్నారు. 19 నెలల చంద్రబాబు పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది జగన్ గుర్తు చేశారు. బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయాయని, రూ.1100 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయన్నారు. కౌలు రైతుల పరిస్థతి దయనీయంగా ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంగా.. 10 వేలే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు
చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసుగా తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నాడని.. ఇది బెయిల్ కండీషన్స్‌ను ఉల్లంఘించడం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారన్నారు.అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉన్నప్పటికి బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారని… వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారని విమర్శించారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మద్యం కేసు నుంచి బయటపడేందుకే ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లేనని.. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రెడ్ బుక్ ను ఫాలో అవుతున్నారని ఆరోపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram