Hyderabad | హైదరాబాద్‌లో విషాదం.. కుమార్తెలకు నిద్ర మాత్రలిచ్చి తండ్రి సూసైడ్

Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని భవానీ నగర్‌లో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు నిద్ర మాత్రలు ఇచ్చి చంపేశాడు. అనంతరం ఆ పిల్లల తండ్రి కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
కుటుంబ సభ్యులు, స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రీకాంత్, శ్రావ్య(7), స్రవంతి(8)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.