Hyderabad | ప్రియుడిపై కోపంతో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Hyderabad | ప్రియుడిపై కోపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కేపీహెచ్‌బీ పరిధిలోని వన్‌సిటీలోని ఏ బ్లాక్‌లో నివాసం ఉంటోంది. డేటింగ్ యాప్‌లో నెల్లూరుకు చెందిన మనోజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మనోజ్ మియాపూర్‌లో వ్యాపారం చేస్తున్నాడు.
ఇక ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం మనోజ్‌కు ఖుష్బు ఫోన్ చేసి తన వద్దకు రావాలని అడిగింది. తర్వాత వస్తానని చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక కారులో మియాపూర్‌కు బయల్దేరింది. మళ్లీ మనోజ్‌కు ఫోన్ చేసి వసంత్ నగర్ కమాన్ వద్దకు రావాలని, రాకపోతే చనిపోతానని బెదిరించింది. మనోజ్ వచ్చేసరికి ఆమె అపస్మారకస్థితిలో ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఖుష్బు ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.