ఫ్యాన్ కోసం పుష్ప పెద్ద మ‌న‌సు.. ఏం చేస్తాడో చూస్తే నిజంగా మెచ్చుకుంటారు..!

ఫ్యాన్ కోసం పుష్ప పెద్ద మ‌న‌సు.. ఏం చేస్తాడో చూస్తే నిజంగా మెచ్చుకుంటారు..!

చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకింది. పుష్ప‌రాజ్‌గా ఆయ‌న చూపించిన మేన‌రిజానికి ప్ర‌తి ఒక్క‌రు క‌నెక్ట్ అయ్యారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిత్ర షూటింగ్‌ క్లైమాక్స్‌ దశకు చేరుకోగా, వ‌చ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం కోసం సౌత్ ప్రేక్ష‌కులే కాదు నార్త్ వాళ్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప చిత్రంలోని పాటలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకోవ‌డంతో పుష్ప 2 కోసం ఎలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నార‌నే చర్చ కూడా న‌డుస్తుంది.

అల్లు అర్జున్‌కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ హీరోల్లోనే అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 23.5 మిలియన్ల మంది ఫాలోవర్లు బ‌న్నీకి ఉండ‌గా, ఆయ‌న‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ఆయ‌న అభిమానులు గ‌మ‌నిస్తుంటారు. అయితే తాజాగా బన్నీ తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీయ‌గా, ఇందులో తన ఫ్యాన్‌తో ఫన్నీగా మాట్లాడాడు బన్నీ. ఓటు వేసేందుకు సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన బ‌న్నీ.. ఓటింగ్ సెంట‌ర్ ద‌గ్గ‌ర లేడి ఫ్యాన్ ని క‌లిసాడు. అక్క‌డ ఆ లేడీ ఫ్యాన్‌ కోసం స్వయంగా తనే వీడియో తీశారు. ‘‘ సరే.. నీకు బాగా ఫాలోవర్స్‌ రావాలని మంచి వీడియో తీస్తున్నాను. ఎంత మంది ఫాలోవర్స్‌ కావాలి. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు’’ అని అడిగారు. అందుకు ఆమె ‘‘ 13కే ’’ అని చెప్పింది. అప్పుడు అల్లు అర్జున్‌ ‘‘ మినిమమ్‌ ఎంత టచ్‌ అవ్వాలి’’ అని అడిగారు. అశ్విని ‘‘ 20 – 30 కే’’ అని అంది. ‘‘ 30కే.. ఈ వీడియోతో వస్తారా?’’ అని అల్లు అర్జున్‌ ప్రశ్నించారు. అందుకు అశ్విని ‘‘ వస్తారు అండి ’’ అంది

బ‌న్నీ తీసిన సెల్ఫీ వీడియోని అశ్విని త‌న ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో అది క్ష‌ణాల‌లోనే వైర‌ల్‌గా మారింది. వీడియోకి లైకుల వ‌ర్షం కురుస్తుంది. ఫాలోవర్లు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఇక ఫ్యాన్‌తో ఇంత సరదాగా బన్నీ మాట్లాడటం చూసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. కాగా, ఓటింగ్ డే రోజు ఉదయాన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో అల్లు అర్జున్ తన ఓటు వేశాడు బన్నీ. అల్లు అర్జున్‌ను చూడగానే అక్కడ ఉన్న ఓటర్లంతా ఆప్యాయంగా పలకరించ‌గా, వారందరినీ నవ్వుతూ విష్ చేసి తన ఓటు వేసి సైలెంట్‌గా వెళ్లిపోయాడు బన్నీ.