అనసూయ వాళ్లని అంత మాట అనేసింది ఏంటి.. రేపిస్ట్‌లు అంటూ ఫైర్

జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అనసూయ చాలా రోజుల పాటు యాంకర్‌గా అలరించింది. పలు టీవీ ఛానెల్స్‌లో తనదైన యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ షోతో కూడా మెప్పించింది. అనసూయ గ్లామర్‌కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఎప్పుడు ఎలాంటి ఫోటో అయిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా అది క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కూడా అనసూయ గ్లామర్ షో విషయంలో ఎలాంటి కండీషన్స్ పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఆమెని ట్రోల్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. అయితే తనపై కామెంట్ చేసే వారికి అనసూయ గట్టిగానే బదులిస్తూ ఉంటుంది. అనసూయని ఆంటీ అని గతంలో బాగా ట్రోల్ చేయగా, ఆంటీ ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆ సమయంలో ఆంటీ అని ఎవరైన ట్రోల్ చేస్తే పోలీస్ కేసు పెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది అనసూయ.
అయితే అసలు ఆంటీ అని అంటే తనకు ఎందుకు అంతలా కోపం వస్తుంది అనేది తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనసూయ. నేను ఏదైన పోస్ట్ చేస్తే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ అని అంటుంటారు. అసలు అంటీ అనే పదం తప్పు కాదు, కాని కొందరు మాత్రం వల్గర్‌గా వాడుతుంటారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని క్యూట్ గా పిలిస్తే నాకు ఏమి అనిపించదు. చాలా హ్యాపీనే. కానీ నా ఏజ్, నీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆంటీ అని మరో రకంగా పిలిస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. అసలు ఆంటీ అని ఇంగ్లీష్ లో పిన్నికి, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి వాడతారు.
నేను కూడా చిన్నప్పుడు చాలా మంది పక్కింటి వాళ్ళని ఆంటీ అనే పిలిచాను. ఒకవేళ వాళ్ళు నన్ను అలా పిలవొద్దు అంటే నేను పిలవను. నేను అలా పిలిచి వాళ్లని హర్ట్ చేయను. వారి పరిస్థితిని అర్ధం చేసుకొని అలా పిలవడం ఆపేస్తాను. నన్ను ఆంటీ అని పిలవడం ఏదో కారణం వలన నచ్చడం లేదు. అది నాకు నచ్చదు , అలా పిలవడం ఆపమని అంటే అలానే ట్రోల్ చేస్తున్నారు. అసలు అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి. అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు. నా మీద కామెంట్స్ వేసేవాడ్ని ఫేస్ టు ఫేస్ జన్మలో చూస్తానో కూడా లేదో తెలీదు, వాడు నన్ను చూస్తాడో లేదో తెలీదు. కాని నా మీద అంత హేట్ ఉందంటే అతని చుట్టు పక్కన ఉన్న ఆడవాళ్ళని ఇంకెలా చూస్తాడు. ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ లో రేపిస్ట్ లు అవుతారు అంటూ అనసూయ చాలా సీరియస్‌గా కామెంట్ చేసింది. అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.