Site icon vidhaatha

చిన్నారి పెళ్లి కూతురు చిచ్చు పెట్టిందిగా.. ఏమందం గురూ ఇది..!

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముందు ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి ఆ త‌ర్వాత నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకానొక టైంలో అవికా గోర్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రు భావించారు. కాని ఎందుకో వెన‌క‌ప‌డిపోయింది. స‌క్సెస్ రాక‌పోవ‌డం, అందులోను ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ‌గా మార‌డంతో అవ‌కాశాలు చేజారాయి. అయితే అవికా గోర్ ఖాతాలో ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో మంచి హిట్ ఒక్క‌టి కూడా ద‌క్కించుకోలేదు. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తుండ‌గా, వాటిపై భారీ హోప్సే పెట్టుకుంది.

అవికా గోర్ ప‌ద్ద‌తిగా క‌నిపించింది. అలానే వెండితెరపై అప్పుడ‌ప్పుడు గ్లామర్ ఒలకబోసింది .రాజుగారి గది 3లో హర్రర్ రోల్ పోషించి అల‌రించింది. అవికాగోర్ ..సొంతగా నిర్మాతగా కూడా మారి ఒక సినిమాను కూడా రూపొందించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సినిమా నిరాశ‌ని మిగ‌ల్చ‌డంతో మ‌ళ్లీ అటువైపు పోవ‌డం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ‌ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటు గ్లామర్ ని వలకబోస్తూ కుర్రాళ్ల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు తన క్యూట్ లుక్స్ తో నటనతో మెప్పిస్తూ అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది అవికా గోర్. అవ‌కాశాలు ప‌ల‌క‌రించని నేప‌థ్యంలో అవికా గ్లామ‌ర్ డోస్ పెంచింది.

తాజాగా అవికా వదిలిన ఫోటోలు కుర్రాళ్ల‌కి మత్తెక్కిస్తున్నాయి. . బ్లాక్ డ్రెస్ లో థైస్, క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ చంకలో పిల్లిని ఎత్తుకుని అవికా ఇచ్చిన పోజులు అద‌ర‌హో అనిపిస్తున్నాయి. అవికాని ఇలా చూసి ప్ర‌తి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. అవికాలో మంచి గ్లామ‌ర్ ఉంది కాని ఎందుకో స‌రైన స‌క్సెస్ ద‌క్క‌డం లేద‌ని కొంద‌రు ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. అవికా గ్లామ‌ర్ షో చూస్తుంటే.. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. మ‌రి అవికాని ఇలా అయిన నిర్మాత‌లు క‌రుణిస్తారా లేదా అనేది చూడాలి.

Exit mobile version