ఎమోషనల్‌గా మారిన బిగ్ బాస్ హౌజ్.. శోభా తల్లి సర్‌ప్రైజ్‌తో యావర్ షాక్

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ టైం నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ ఆడిపిస్తూ మరోవైపు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులని ఒక్కరొక్కరిగా హౌజ్‌లోకి ప్రవేశింపజేస్తున్నారు. గురువారం రోజు ప్రసారం అయిన 68వ ఎపిసోడ్ లో ముందుగా అమర్ దీప్ సతీమణి, టివి నటి తేజస్విని గౌడ హౌజ్‌లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్.. అమర్‌దీప్‌ని ఓ ఆట పట్టించారు.అమర్ దీప్ ముందు ఓ కేక్ పెట్టి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పిన బిగ్ బాస్.. తన భార్య తేజస్విని ఆ కేక్ ను పంపించారని , ఆమెకు రావడం కుదరలేదు అని పంచ్ వేశాడు. దాంతో కాస్త నిరాశ పడ్డాడు అమర్. అంతలోనే అతని భార్య రావడంతో అమర్ ఆనందం అంతా ఇంతా కాదు
తేజేస్వినిని కౌగిలించుకొని తన ప్రేమనంతా చూపించాడు. ఇది చూసిన శివాజి వారిని ఒంటరిగా వదిలేయండి అని మిగతా సభ్యులని పక్కకు తీసుకెళ్లారు. ఇక ఆ సమయంలో తేజస్విని, చాలా రొమాంటిక్‌గా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇక అమర్ దీప్ కోసం వాళ్ల ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసుకొచ్చి దానిని సినిమాటిక్ స్టైల్‌లో తొడిగింది తేజస్విని ఇక ఇంటి సభ్యుల మధ్య అమర్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు. భార్యకి కేక్ తినిపించాడు. తేజస్విని అమర్ కి రొమాంటిక్ గా కిస్ పెట్టి అది చెరిగిపోకూడదని చెప్పింది. అనంతరం తన భార్యని ఎత్తుకొని డ్యాన్స్‌లు చేశారు అమర్.
ఇక తేజస్విని ఇంట్లో నుంచి బయటకి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్..తేజస్వినితో మాట్లాడుతూ అన్న విషయంలో నన్ను ఏమి అనుకోవద్దని అంటాడు. అప్పుడు తేజస్విని మీరంతా బాగానే ఉన్నారు కదా, అలా ఏమి లేదు. మా ఆయన చిన్నపిల్లాడిలాంటి వాడు. ఏది మనసులో పెట్టుకోవద్దు అని చెప్పేసి వెళ్లిపోతుంది. అనంతరం శోభా శెట్టి తల్లి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడుతుంది. తన తల్లి రాగానే శోభా శెట్టి కేకలు పెడుతూ ఉరుక్కుంటూ వెళ్లి తల్లిని కౌగలించుకుని ఏడ్చేసింది. శోభా తల్లి అందరితో ఆప్యాయంగా మాట్లాడడమే కాకుండా యావర్ కు గిఫ్ట్ ఇచ్చి అతడిని ఎమోషనల్ అయ్యేలా చేశారు. యావర్ ను కౌగిలించుకొని నేను మీ అమ్మలానే నువ్వు నాకు కొడుకువే అంటూ యావర్ అమ్మ ఫోటోను ఇచ్చారు శోభా తల్లి. దాంతో ఫుల్ ఎమోషనల్ అయిన యావర్ శోభా తల్లి కాళ్ళ మీద పడ్డాడు. అనంతరం శోభా తల్లి కూతురికి కొన్ని విషయాలు చెప్పి వెళ్లిపోయింది. అనంతరం యావర్ సోదరుడు హౌజ్‌లోకి వస్తాడు. యావర్‌కి తల్లిప్రేమ తెలియదు అని చెబుతాడు. అన్నదమ్ములు ఇద్దరు తెగ ఏడ్చేయడంతో శివాజి వారిని ఓదారుస్తాడు. ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగింది.