SSMB29 | మహేశ్–రాజమౌళి సినిమాలో విదేశీ నటీనటులు.?

ఇప్పుడు తెలుగు సినిమా అభిమాని ఆసక్తంతా మహేశ్–రాజమౌళి సినిమా గురించే. #SSMB29 గా పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి అప్పుడొకటి, ఇప్పుడొకటి అవుతున్న లీకులు మహేశ్ ఫ్యాన్స్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్బాబు– దర్శక దిగ్గజం రాజమౌళి(Mahesh Babu-Rajamouli) కాంబినేషన్లో దుర్గా ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించబోతున్న చిత్రం అన్ని విషయాలలో సంచలనాల మోత మోగిస్తున్నది. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ అని ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ పలు సందర్భాలలో చెప్పాడు. అమెజాన్ అడవుల (Forest Adventure) నేపథ్యంలో జరిగే కథనీ, ఎక్కువ శాతం షూటింగ్ ఫారిన్లోనే అని కూడా తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ లుక్టెస్ట్ కూడా జరిగిందని, 8 రకాల గెటప్స్లో రెండు రాజమౌళి ఫైనల్ చేసాడని అంటున్నారు.
ఇక నటీనటుల విషయానికొస్తే, రోజొక కొత్త పేరు తెరపైకి వస్తోంది. దేశంలోని వివిధ భాషల్లోని పేరొందిన స్టార్లతో పాటు, విదేశీ నటీనటులు కూడా ఇందులో భాగం కానున్నారు. కథానాయికగా ఇండోనేషియా అందగత్తె చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్( Chelsea Elizabeth Islan) ను ఎంపిక చేసారని తెలుస్తోంది. అలాగే మార్వెల్ అవెంజర్స్ థోర్(Thor)గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్ హెమ్స్వర్త్(Chris Hemsworth) కూడా నటించబోతున్నాడని, ఈమధ్యే రాజమౌళి అయన్ను కలిసి స్టోరీ చెప్పి ఒప్పించాడని కూడా రూమర్స్. ఇవన్నీ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. సరే హీరోయిన్గా అనుకుంటున్న చెల్సియా ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (28) అమెరికాలో పుట్టిన ఇండోనేషియా నటి (Indonasian Actress). తండ్రి అమెరికన్ కాగా, తల్లి ఇండోనేషియన్. తరువాత ఇండొనేషియా రాజధాని జకార్తాకు వెళ్లిపోయిన ఈ కుటుంబం, అక్కడే స్థిరపడింది. చెల్సియా అక్కడే చదువుకుని, ముందుగా నాటకాలలో నటించి, తరువాత 2013లో సినిమాల్లోకి ఎంటరయింది. చాలా మంచి సినిమాల్లో నటించిన చెల్సియా నటనకు ఇండొనేషియాలో ఎన్నో అవార్డులు వచ్చాయి. తనకు సామాజిక స్పృహ కూడా ఎక్కువ. అక్కడ యూత్ ఆఫ్ ఇండొనేషియా అనే స్వచ్చంద సంస్థను కూడా స్థాపించి ప్లూరలిజంను ప్రమోట్ చేస్తుంటుంది. 2022లో రాబ్ క్లింటన్ (Rob Clinton) అనే ఇండొనేషియా రాజకీయవేత్తను 2022లో పెళ్లాడింది.
ఇక క్రిస్ హెమ్స్వర్త్ ప్రపంచ సినిమా అభిమానులకు బాగా పరిచయమే. ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన మార్వెల్ కామిక్ అవెంజర్స్(Avengers)లో థోర్ పాత్ర పోషించాడు. ఆ సిరీస్లోని అన్ని సినిమాలలో తనే థోర్గా నటించాడు. 40 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా నటుడు అవెంజర్స్–థోర్గా మాత్రమే కాకుండా, వేరే ఇంగ్లీష్ హిట్ సినిమాల్లో కూడా నటించాడు. వాటిలో స్టార్ ట్రెక్, ఘోస్ట్బస్టర్స్, 12స్ట్రాంగ్, ఎక్స్ట్రాక్షన్1,2 లాంటి బ్లాక్బస్టర్ సినిమాలున్నాయి. ఈయన ఇప్పుడు #SSMB29లో విలన్గా నటించబోతున్నట్లు తెలిసింది.

ఏదేమైనా, రాజమౌళి నోటినుంచి గానీ, మహేశ్బాబు నుంచి గానీ ఒక్క మాట కూడా రాలేదు. అంటే రాజమౌళి ఆ మాత్రం జాగ్రత్తలు పాటిస్తాడని తెలుసు కదా. తనే ఓ ప్రెస్మీట్ పెట్టి త్వరలో వివరాలు ప్రకటిస్తాడని ఊహిస్తున్నారు. స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమా ఇక షూటింగ్కు వెళ్లడమే ఆలస్యం.