వైరల్ అవుతున్న చిరంజీవి పదో తరగతి సర్టిఫికెట్..ఎక్కడ పుట్టాడంటే..!

టాలీవుడ్ యంగ్ హీరోల కన్నా కూడా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీఎంట్రీ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే మూవీని చేస్తుండగా, ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది.
చిరంజీవి చాలా మందికి రోల్ మోడల్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. నటన, డ్యాన్స్, ఫైటింగ్స్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులని అలరించిన చిరంజీవి అనేక అవార్డులని కూడా అందుకున్నారు. ఇటీవల చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ కూడా దక్కింది. ఇంకా ఆయన ఎన్నో అవార్డులు అందుకుంటారని అభిమానులు గట్టిగా చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సర్టిఫికెట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో చిరంజీవి పేరు: కె.ఎస్.ఎస్. వర ప్రసాద రావు (కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ రావు)గా ఉండగా, తండ్రి పేరు: వెంకట్రావు నేషనాలిటీ: ఇండియన్, హిందు, తెలుగు లింగం: పురుష, పుట్టిన తేదీ: 22.08.1955 పుట్టిన స్థలం: పెనుగొండగా ఉంది.
చిరంజీవి పూర్తి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే విషయం చాలా మంది తెలుసు. వెండి తెరపై మాత్రం ఆయన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్నారు. మెగాస్టార్ అనే బిరుదు అందుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనిషి అనిపించుకున్నారు. చిరంజీవికి అభిమానులు మన దేశంలోనే కాదు విదేశాలలోను ఉన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలని ప్రతి చోట ఎంత ఘనంగా నిర్వహిస్తుంటారో మనం చూస్తుంటాం. ఇక చిరు సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తుంటారు.
Surbhi Puranik | చావు అంచుల దాకా వెళ్లి వచ్చానన్న హీరోయిన్ సురభి పురాణిక్..!