10th Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ విధాత బ్యూరో, కరీంనగర్: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ రాజకీయ మలుపు తిరిగి, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన నేపథ్యంలో, మిగిలిన పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును మరింత విస్తృతం చేశారు. పరీక్షలు కొనసాగుతున్నంత సేపు పరిసరాలలో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని […]

- 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు
- ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్
విధాత బ్యూరో, కరీంనగర్: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ రాజకీయ మలుపు తిరిగి, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన నేపథ్యంలో, మిగిలిన పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును మరింత విస్తృతం చేశారు.
పరీక్షలు కొనసాగుతున్నంత సేపు పరిసరాలలో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని
ఆయా జిల్లాల పోలీసు శాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచన చేశారు. ఈమేరకు
పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న ఇండ్లు, ఇతర నిర్మాణాలు, శివారు ప్రాంతాల్లో పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలను నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నంత సేపు విద్యార్థులు కేంద్రాలను వదిలి వెళ్ళరాదని ఆంక్షలు విధించారు.
పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించవద్దని, సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.