Medak l ఆత్మవిశ్వాసంతో ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు: కలెక్టర్
స్వీయ ప్రణాళికతోపాటు పాఠ్యాంశ పునశ్ఛరణ కీలకం జిల్లా కలెక్టర్ రాజర్షి షా 10th Class Collector Rajarshi Shah విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కన బర్చాలంటే స్వయం ప్రణాళిక పాఠ్యాంశ పునశ్ఛరణతో పాటు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితా లు సాధించడం తేలికని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah)పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ […]

- స్వీయ ప్రణాళికతోపాటు పాఠ్యాంశ పునశ్ఛరణ కీలకం
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
10th Class Collector Rajarshi Shah
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కన బర్చాలంటే స్వయం ప్రణాళిక పాఠ్యాంశ పునశ్ఛరణతో పాటు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితా లు సాధించడం తేలికని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah)పేర్కొన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాలలోని 150మంది విద్యార్థులకు(Students) జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశంపై ప్రేరణ తరగతులు, భవిష్యత్తు మార్గదర్శక తరగతులను నిర్వహించారు.
‘పది’ గ్రేడ్ సాధిస్తే ప్రైజ్ మనీ, విహార యాత్ర: కలెక్టర్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రేరణ తరగతులు ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలకు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలంటే స్వీయ ప్రణాళికతోపాటు పాఠ్యాంశ పునశ్ఛరణ కీలకమని కలెక్టర్ సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష రాసి పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి సత్తా చాటిన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ప్రైజ్ మనీ అందజేస్తామన్నారు. దాంతోపాటు విహార యాత్రకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
కష్టపడితేనే బంగారు భవిష్యత్ కళ్ల ముందుంటుందన్నారు. ఎస్సీ వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో రాణిం చేలా కృషి చేయాలన్నారు. ప్రేరణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో రాణించాలని కోరారు.
ప్రణాళిక బద్ధంగా చదవాలి: TNGO జిల్లా అధ్యక్షుడు నరేందర్
విద్యార్థులు కష్టమని భావించకుండా ఇష్టంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ సూచించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకుంటారని విద్యార్థులకు ఉద్బోధించారు. ఎంతటి కష్టం వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పరిపూర్ణమైన నమ్మకంతో ముందడుగు వేస్తే అవరోధాలను అధిగమించి విజయం సాధించగల్గుతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్ బాబు విద్యార్థులకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. అన్ని సబ్జెక్టులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఆయా సబ్జెక్టుల్లో ఉన్న విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు ఫజలుద్దీన్, బీసీ సంక్షేమ సహాయాధికారి నాగరాజు గౌడ్, వసతి గృహ అధికార్లు తులసీరామ్, జయ్ రాజ్, శివరాం, విక్రమ్, శాంతాబాయి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.