పదో ప్రయత్నంలో పదో తరగతి పాస్.. డప్పు వాయిద్యాలతో ఊరేగించిన గ్రామస్తులు
పట్టువదలని విక్రమార్కుడన్న పేరును మరో యాంగిల్‌లో చూపించాడు ఓ మహారాష్ట్ర విద్యార్థి. మహారాష్ట్ర బీడ్‌కు చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే 2018నుంచి పది సార్లు పదో తరగతి పరీక్షలు రాసి తాజాగా ఉత్తీర్ణత సాధించాడు.

విధాత : పట్టువదలని విక్రమార్కుడన్న పేరును మరో యాంగిల్‌లో చూపించాడు ఓ మహారాష్ట్ర విద్యార్థి. మహారాష్ట్ర బీడ్‌కు చెందిన కృష్ణ నామ్‌దేవ్ ముండే 2018నుంచి పది సార్లు పదో తరగతి పరీక్షలు రాసి తాజాగా ఉత్తీర్ణత సాధించాడు. ముండే పదో ప్రయత్నంలో పదో తరగతి తరగతి పాసైన సందర్భంగా గ్రామస్తులు అతడిని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి వేడుక చేశారు. ఊరంతా అందరికి చక్కెర తీపి చేశారు. స్థానిక ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. బాణసంచా కాల్చారు. ఇప్పుడీ ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు.. బ్యాండు మేళంతో ఊరేగించిన గ్రామస్థులు
మహారాష్ట్ర – బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు.
దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. pic.twitter.com/rDZ5AvMlbp
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024