మహారాష్ట్రలో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం

- మరో 22 మందికి గాయాలు.. బీడ్ జిల్లాలో ఘటన
విధాత: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముంబై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీడ్‌కు బస్సు వెళ్తుండగా ఉదయం 5.45 – 6 గంటల మధ్య ఆష్టా ఫటా వద్ద బస్సు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు వెల్లడించారు.
మృతి చెందిన వారిలో నలుగురు బీడ్ జిల్లా వాసులు ఉన్నారు. ఒకరు యవత్మాల్‌కు చెందిన వారని అష్టి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంతోష్ ఖేత్మలాస్ తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వివిధ దవాఖాలనకు తరలించారు. అతివేగంగా బస్సు నడపడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓవర్ టర్న్ అయి బస్సు బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.