Coromandel Express | ఘోర రైలు ప్రమాదం..! పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. 207 మంది మృతి..!

Coromandel Express accident | కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. బెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఒడిశా బాలసోర్‌ జిల్లాలో పట్టాలు తప్పింది. ఆ తర్వాత వేరే మార్గంలో వస్తున్న రైలును ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో 207 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దాదాపు 900 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎనిమిది […]

Coromandel Express | ఘోర రైలు ప్రమాదం..! పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. 207 మంది మృతి..!

Coromandel Express accident |

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. బెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఒడిశా బాలసోర్‌ జిల్లాలో పట్టాలు తప్పింది. ఆ తర్వాత వేరే మార్గంలో వస్తున్న రైలును ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో 207 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దాదాపు 900 మందికి పైగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఎదురుగా మరో మార్గంలో వస్తున్న బెంగళూరు – హౌరా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టింది.

ఈ ఘటనలో మొత్తం 70 మంది వరకు ప్రమాదంలో చనిపోయారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన సుమారు 12 బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయని చెప్పారు. నాలుగు బోగీలు చాలా దూరం దూసుకుపోయాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నైకి మధ్యాహ్నం 3.30 గం

టల బయలుదేరింది. ఒడిశా బాలాసోర్ స్టేషన్‌కు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చేరుకుంది. సుమారు 7 గంటల సమయంలో బహనాగ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే, పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల కోసం 06782-262286 హెల్ప్ లైన్ నంబర్‌ను రైల్వే ఏర్పాటు చేసింది. విజయవాడ స్టేషన్‌కు సంబంధించి 0866-2576924, రైల్వే 67055 హెల్ప్ లైన్ నంబర్‌ను రాజమండ్రి స్టేషన్‌లో 08832420541 రైల్వే 65395 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినికుమార్‌ పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలకు గురైన వారికి రూ.2లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50వేలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సంఘటనా స్థలం సందర్శనకు వెళ్తున్నానని, అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ఘోర రైలు దుర్ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం శనివారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది.