Odisha Train Accident | పట్టాలపై రక్తపుటేరులు.. తునాతునకలైన మృతదేహాలు..
Odisha Train Accident | ఒడిశాలో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు రైలు ప్రమాదాలు.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు రక్తసిక్తమయ్యాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో అల్లాడిపోయింది. ఈ ఘోర ప్రమాద ఘటనపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశారు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్తున్నాను. ఈ ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డాను. ఇప్పటి వరకు ఇంత ఘోరమైన […]

Odisha Train Accident | ఒడిశాలో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు రైలు ప్రమాదాలు.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు రక్తసిక్తమయ్యాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో అల్లాడిపోయింది.
ఈ ఘోర ప్రమాద ఘటనపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశారు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్తున్నాను. ఈ ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డాను. ఇప్పటి వరకు ఇంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు.
బెంగళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని మూడు జనరల్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో జనరల్, స్లీపర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని బాధిత ప్రయాణికుడు అనుభవ్ దాస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
ఈ ఘోర ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. రైలు పట్టాలపై రక్తపుటేరులు.. ఇలాంటి ఘోరాన్ని మరిచిపోలేను అని పేర్కొన్నాడు. బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు అనుభవ్ దాస్ పేర్కొన్నాడు.
As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n
— Anubhav Das (@anubhav2das) June 2, 2023