14 మందితో సీపీఎం తొలి జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో సీపీఎం పార్టీ కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించిన సీపీఎం.. ఆదివారం 14 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. హుజుర్‌నగర్, కోదాడ, నల్లగొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
సీపీఎం తొలి జాబితా ఇదే..
1. భద్రాచలం(ఎస్టీ) – కారం పుల్లయ్య
2. అశ్వరావుపేట(ఎస్టీ) – పిట్టల అర్జున్
3. పాలేరు – తమ్మినేని వీరభద్రం
4. మధిర(ఎస్సీ) – పాలడుగు భాస్కర్
5. వైరా(ఎస్టీ) – భుక్యా వీరభద్రం
6. ఖమ్మం -ఎర్ర శ్రీకాంత్
7. సత్తుపల్లి(ఎస్సీ) – మాచర్ల భారతి
8. మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి
9. నకిరేకల్(ఎస్సీ)- బొజ్జ చిన్న వెంకులు
10. భువనగిరి – కొండమడుగు నర్సింహ్మ
11. జనగాం – మోకు కనకారెడ్డి
12. ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య
13. పటాన్‌చెరు – జే మల్లికార్జున్
14. ముషీరాబాద్ – ఎం దశరథ్