Prabhas | ‘ది రాజాసాబ్’ రిలీజ్ ముంగిట ప్రభాస్ ఆప్యాయత.. ఫ్యాన్‌తో భేటీ వైరల్

Prabhas |  ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ విజయాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

  • By: sn |    movies |    Published on : Jan 08, 2026 9:42 AM IST
Prabhas | ‘ది రాజాసాబ్’ రిలీజ్ ముంగిట ప్రభాస్ ఆప్యాయత.. ఫ్యాన్‌తో భేటీ వైరల్

Prabhas |  ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ విజయాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు ముందే ప్రభాస్ మరోసారి తన వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని తన జూబ్లీ హిల్స్ నివాసంలో కొంతమంది అభిమానులతో ప్రభాస్ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీలేఖ అనే లేడీ ఫ్యాన్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ప్రభాస్ అభిమానులను కలవడంలో ఎంతో సాదాసీదాగా, ఆప్యాయంగా వ్యవహరించాడట. అంతేకాదు, ఆయనే స్వయంగా గేటు దగ్గరకు వచ్చి అభిమానులకు స్వాగతం పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొంది.

ఆ ఫ్యాన్ తన పోస్ట్‌లో, “ప్రభాస్‌ను ఆయన ఇంట్లో కలవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. మమ్మల్ని చూసిన వెంటనే ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరి క్షేమ సమాచారం అడిగారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది ఆ సమయంలో స్పష్టంగా తెలిసింది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే తాను ప్రభాస్‌కు భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చానని, ఆయన పెంపుడు జంతువుకు చిన్న గిఫ్ట్ కూడా అందించానని తెలిపింది. ప్రభాస్‌తో కొద్దిసేపు గడపడం తనకు ఎంతో అదృష్టంగా అనిపించిందని ఆమె పేర్కొంది.ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తూ, ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెరపై భారీ హీరోగా కనిపించే ప్రభాస్, నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్‌గా, అభిమానులకు దగ్గరగా ఉండడం మరోసారి రుజువైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు ‘ది రాజాసాబ్’ రిలీజ్ కోసం ఎదురుచూపులు, మరోవైపు ప్రభాస్ ఆప్యాయతతో వచ్చిన ఈ ఘటన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Srilekha Honey (@srilekha_honey)