సీటెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జులై 7న రాత‌ప‌రీక్ష‌

దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వ‌హించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్షకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 19వ ఎడిష‌న్ సీటెట్ ప‌రీక్ష‌ను 2024, జులై 7వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ వెల్ల‌డించింది.

సీటెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జులై 7న రాత‌ప‌రీక్ష‌

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వ‌హించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్షకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 19వ ఎడిష‌న్ సీటెట్ ప‌రీక్ష‌ను 2024, జులై 7వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ వెల్ల‌డించింది. మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 11:59 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించొచ్చు. దేశ వ్యాప్తంగా 136 న‌గ‌రాల్లో 20 భాషల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ప‌రీక్ష‌లో మొత్తం రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్ -1 ఒక‌టి నుంచి ఐదు త‌ర‌గతుల‌కు బోధించాల‌నుకునేవారు, పేప‌ర్-2ను ఆరు నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు బోధించాల‌నుకునే వారు రాయొచ్చు. పేప‌ర్ -2 ప‌రీక్ష ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, పేప‌ర్ -1 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4:30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు ఒక పేప‌ర్‌కు రూ. 1000, రెండు పేప‌ర్ల‌కు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే ఒక పేప‌ర్‌కు రూ. 500, రెండు పేప‌ర్ల‌కు రూ. 600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం https://ctet.nic.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.