సీబీఎస్‌ఈ 10,12తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతుల వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. పదవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి

విధాత : సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతుల వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. పదవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సైన్యం భరద్వాజ్ తెలిపారు.