CTET | ఫిబ్రవరి 7, 8 తేదీల్లో సీటెట్ ఎగ్జామ్..!
CTET | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు ( Central Teacher Eligibility Test ) నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈ( CBSE ) కీలక నిర్ణయం తీసుకుంది. సీటెట్( CTET ) రాత పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది.
CTET | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు ( Central Teacher Eligibility Test ) నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈ( CBSE ) కీలక నిర్ణయం తీసుకుంది. సీటెట్( CTET ) రాత పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ఎందుకంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరి 8వ తేదీన సీటెట్ పరీక్ష నిర్వహించాలనుకున్నారు. కానీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా 141 సిటీల్లో ఈ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల పాటు రెండు షిఫ్ట్‌ల్లో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులను కేర్‌ఫుల్‌గా చదివి, తమకు ఏ తేదీన కేటాయిస్తే ఆ తేదీన సదరు సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఎగ్జామినేషన్ డేట్, పేపర్, షిఫ్ట్ టైమింగ్స్‌తో పాటు ఇతర విషయాలను నిశితంగా గమనించాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram