DK Aruna | గద్వాల ఎమ్మెల్యేగా డీకె. అరుణ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

DK Aruna | విధాత, హైకోర్టు ఆదేశాల మేరకు గద్వాల ఎమ్మెల్యేగా డీకె. అరుణను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ప్రచురణలో పేర్కోనాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీలకు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ కేసులో జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల అమలు కోరుతూ డీకె అరుణ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. […]

  • Publish Date - September 4, 2023 / 12:36 PM IST

DK Aruna |

విధాత, హైకోర్టు ఆదేశాల మేరకు గద్వాల ఎమ్మెల్యేగా డీకె. అరుణను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ప్రచురణలో పేర్కోనాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీలకు ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ కేసులో జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు ఉత్తర్వుల అమలు కోరుతూ డీకె అరుణ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. స్పందించిన ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా డీకె అరుణను గుర్తిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. లేఖతో పాటు హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది.

అటు కృష్ణ మోహన్‌రెడ్డి కూడా హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఇప్పటిదాకా సవాల్ చేయకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం సదరు ఆదేశాలిచ్చింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎస్‌, అసెంబ్లీ సెక్రటరీలు ఎప్పటిలోగా అమలు చేస్తారు…స్పీకర్ అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఆమెతో ప్రమాణాస్వీకారం చేయిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

Latest News