ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. తెలుగు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలో నట విశ్వవిఖ్యాత సార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నారు. జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు అంటే అది ఖచ్చితంగా రామారావు మాత్రమే అనేలా పాత్రలు చేసి ఉన్నత స్థాయికి చేరి మహనీయుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి గొప్ప నటుడు తన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం తెలుగు సిని ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి. అంతటి మహానీయుడు ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.
మరి ఎన్టీఆర్ కు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు. ఆయనకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి. ఆయన సినిమాకు మొదట తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ టైమ్ ఎల్వీ ప్రసాద్ నటి నిర్మాత అయిన కృష్ణవేణికి.. ఎన్టీఆర్ ను పరిచయం చేశారు. ఆమె నటించిన మనేదేశం సినిమాలోకి తీసుకుంటానని చెప్పారట. అలా ఆ సినిమా కోసం ఎన్టీఆర్ కేవలం రూ. 2000 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట.
అలా ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ మనదేశం సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత నుండి ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఏకధాటిగా సూపర్, డూపర్ హిట్లు అవుతుండటంతో నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఎన్నో సినిమాల్లో నటించి పేరు పెంచుకోవడం, ఆయన నటనకు ప్రేక్షకులు ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టడం జరిగాయి. ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ ను మాత్రమే చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చేవారు. అలా ఆయన నటించిన ఎన్నో సినిమాలు మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి.