ఓ ఇంటి ఆవరణలో నాలుగు చిరుత పులులు.. చివరకు ఏమైందంటే..?
ఇటీవలి కాలంలో చిరుతలు అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో చిరుతలు హల్‌చల్ చేస్తున్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో చిరుతలు అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో చిరుతలు హల్‌చల్ చేస్తున్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిరుతల సంచారంతో జనాలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఓ బాలుడు తన ఇంట్లో వీడియో గేమ్ ఆడుతుండగా.. సైలెంట్‌గా చిరుత ఇంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బాలుడు చాకచక్యంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. గడియ పెట్టాడు.
తాజాగా మహారాష్ట్ర చంద్రాపూర్‌లోని ఓ ఇంటి ఆవరణలో నాలుగు చిరుత పులులు ప్రత్యక్షమయ్యాయి. అర్ధరాత్రి వేళ.. ఆ చిరుతులు గాండ్రిస్తూ అటు ఇటు తిరిగాయి. కాసేపటికి ఒకదాని తర్వాత మరొకటి.. ఇంటి గేటుపై నుంచి దూకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఘటన మార్చి 4వ తేదీన జరిగినట్లు తెలిసింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆఫీసర్ నవీన్ గెహ్లాట్‌కు కేటాయించిన బంగ్లాలోకి చిరుతలు ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. చిరుతల సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Last night at10pm,Staff quarters Ordnance Factory, Khamaria, Jabalpur. pic.twitter.com/cM51vk0S3S
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?— Anil Talwar