Tiger Blocks Road : రోడ్డుపై పెద్దపులి దర్జా..స్తంభించిన ట్రాఫిక్

మహారాష్ట్ర చంద్రపూర్‌లో రోడ్డుపై పెద్దపులి కూర్చుంది! వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. అడవికి వెళ్లిపోయిన తర్వాతే వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Nov 29, 2025, 12:30 pm IST
Read Time: 3 mins
Tiger Blocks Road : రోడ్డుపై పెద్దపులి దర్జా..స్తంభించిన ట్రాఫిక్

విధాత: అటవీ మార్గం గుండా సాగిపోతున్న వాహనదారులకు ఓ పెద్దపులి బిగ్ షాక్ ఇచ్చింది. రోడ్డుపై కూర్చుని సేద తీరుతూ..ఈ అడవి నాది..రోడ్డు నాది అన్నట్లుగా దర్జా దర్పం ప్రదర్శించింది. రోడ్డు మధ్యలో ఎదురుగా పెద్దపులి కూర్చుని ఉండటంతో బెంబెలెత్తిపోయిన వాహనదారులు ఎక్కడివారక్కడే వాహనాలను నిలిపివేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. టైగర్ రిజర్వ్ ఫారెస్టు తడోబా సమీపంలోని చంద్రపూర్-మొహర్లి రోడ్డుపై ఓ పెద్ద పులి సేదతీరుతూ కనిపించింది. దీంతో ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులు పెద్దపులిని ఇబ్బంది పెట్టకుండా వాహనాలు ఆపివేసి.. అది రోడ్డుపై నుంచి ఎప్పుడు అడవిలోకి పోతుందోనని ఎదురు చూశారు.

అయితే చిత్రంగా ఆ పెద్దపులి రోడ్డుపై తనకు ఇరువైపుల వాహనదారుల ఆగిపోవడం చూసినప్పటికి తనకేమి పట్టనట్లుగా గంటన్నరకు పైగానే రోడ్డుపై సేద తీరింది. చేసేది లేక వాహనదారులు సైతం పెద్దపులిని గమనిస్తూ రోడ్డుపైన ఎక్కడివారు అక్కడే ఆగిపోయి వేచి చూశారు. దాదాపు రెండు గంటల పాటు వాహనదారుల ఓపికగా పరీక్ష పెట్టిన పెద్దపులి చివరకు రోడ్డు దిగి అడవిలోకి వెళ్లిపోవడంతో బతుకు జీవుడా అనుకుంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.