ఎట్ట‌కేల‌కు గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

విధాత‌: తెలంగాణ ప్ర‌భుత్వంలో తొలిసారిగా నిర్వ‌హించిన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి విడుద‌ల చేశారు. ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు ఇక మెయిన్స్‌పై దృష్టి సారించారు. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాల విడుద‌ల‌కు తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం అనుమ‌తి ఇచ్చిన విష‌యం విదిత‌మే. గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఓ […]

  • Publish Date - January 13, 2023 / 12:00 PM IST

విధాత‌: తెలంగాణ ప్ర‌భుత్వంలో తొలిసారిగా నిర్వ‌హించిన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి విడుద‌ల చేశారు. ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు ఇక మెయిన్స్‌పై దృష్టి సారించారు.

గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాల విడుద‌ల‌కు తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం అనుమ‌తి ఇచ్చిన విష‌యం విదిత‌మే. గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఓ అభ్య‌ర్థి స్థానిక‌త వివాదంపై తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అప్పీలుపై హైకోర్టు బుధ‌వారం విచార‌ణ జ‌రిపింది.

ఫలితాల కోసం ఈ క్రింది బ్లూ లింకును క్లిక్ చేయండి

Group-I Results_compressed

స‌ద‌రు అభ్య‌ర్థి స్థానిక‌త వివాదంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అభ్య‌ర్థి స్థానిక‌త వివాదం త‌ర్వాత తేలుస్తామ‌ని చెప్పిన కోర్టు.. ప్ర‌స్తుతానికి గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాల‌ను వెల్ల‌డించుకోవ‌చ్చ‌ని సూచించిన నేప‌థ్యంలో శుక్ర‌వారం ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది టీఎస్‌పీఎస్సీ.

గ్రూప్ 1 ఫలితాలు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2023/01/Group-I-Results_compressed.pdf

యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని, గ్రూప్-1 మెయిన్స్ తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షా ఫ‌లితాల‌ను 1:50 నిష్ప‌త్తిలో ప్ర‌క‌టించింది. అంటే మెయిన్స్‌కు 25,150 మందిని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 503 గ్రూప్-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువడ‌గా, 3,80,081 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అక్టోబ‌ర్ 16న నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌కు 2,85,916 మంది హాజ‌ర‌య్యారు. అక్టోబ‌ర్ 29న ప్రాథ‌మిక కీ వెల్ల‌డించి, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించింది. అభ్య‌ర్థుల నుంచి వ్య‌క్త‌మైన సందేహాల‌పై స‌బ్జెక్ట్ నిపుణుల క‌మిటీ సిఫార్సులు ప‌రిశీలించి, 5 ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించారు. అనంత‌రం న‌వంబ‌ర్ 15వ తేదీన తుది కీని ప్ర‌క‌టించారు. మాస్ట‌ర్ ప్ర‌శ్నాప‌త్రం ప్ర‌కారం 29, 48, 69, 82, 138 ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించింది.

Latest News