Hyderabad Local Bodies MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలకు తెరలేచింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2025 మే 1 నాటికి ప్రస్తుతల ఎమ్మెల్సీ ఎం. ఎస్. ప్రభాకర్ పదవి కాలం ముగిసిపోనుంది.

Hyderabad Local Bodies MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Hyderabad Local Bodies MLC Election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలకు తెరలేచింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2025 మే 1 నాటికి ప్రస్తుతల ఎమ్మెల్సీ ఎం. ఎస్. ప్రభాకర్ పదవి కాలం ముగిసిపోనుంది. ఖాళీ కాబోతున్న ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించబోతున్నారు.

ఈనెల 28 న నోటిఫికేషన్ ,అదే రోజున నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన. ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు. ఏప్రిల్ 23న పోలింగ్.. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లయింది.

నెల క్రితమే రెండు ఉపాధ్యాయ, ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు

ఇటీవల తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసిన సరిగ్గా నెల కూడా దాటకముందే రాష్ట్రంలో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీకి చెందిన మల్క కొమురయ్య గెలుపొందారు. ఇక కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజయ్య విజయం సాధించారు.

ముగిసిన ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు

ఆ తర్వాత ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియ కూడా ఏకగ్రీవంగా పూర్తి చేశారు. తెలంగాణలోకాంగ్రెస్ నుంచి అద్ధంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక ఏపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

29న వారికి వీడ్కోలు
తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా రియాజుల్‌ హాసన్‌ మజ్లిస్‌ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతలు.  అటు ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది.