ఆసీస్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో ఇండియాదే విజ‌యం

ఆసీస్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో ఇండియాదే విజ‌యం

వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి జ్ఞాప‌కం మ‌రచిపోక‌ముందే భార‌త్ విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డింది. రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి టీ 20 మ్యాచ్ చాలా ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కాగా, భార‌త్‌ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0తో ముందంజ‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్ర‌మంలో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులు చేసి టీ20 సిరీస్‌లో తొలి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80) వీరోచిత ఇన్నింగ్స్ ఆడ‌గా, ఇషాన్ కిషన్(39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో అద‌ర‌గొట్టారు. ఇక చివర్లో రింకూ సింగ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) తనదైన శైలిలో షాట్స్ ఆడి ఒక బంతి మిగిలి ఉండ‌గానే భార‌త్‌కి మంచి విజయం ద‌క్కేలా చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా రెం ఓపెనర్ గా బ‌రిలోకి దిగిన రుతురాజ్ గ్వైకాడ్(0) మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఒక్క బంతి కూడా ఆడకుండానే రుతురాజ్‌ డైమండ్ డక్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6 బాదిన జైస్వాల్.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే 22 ప‌రుగుల‌కే రెండు వికెట్స్ కోల్పొయిన స‌మ‌యంలో సూర్య, ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్ది భార‌త్ కి విజ‌యం ద‌క్కేలా చేశారు. ఇక చివ‌ర‌లో రింకూ సింగ్ సిక్సర్‌తో తనదైన శైలిలో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ బంతి నోబాల్ కావడంతో ఈ సిక్సర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు