ప్రూఫ్ చూపించి మ‌రీ ఏజ్ చెప్పిన గుప్పెడంత మ‌న‌సు ఆంటి.. షాక్‌లో నెటిజ‌న్స్

  • By: sn    breaking    Feb 01, 2024 12:20 PM IST
ప్రూఫ్ చూపించి మ‌రీ ఏజ్ చెప్పిన గుప్పెడంత మ‌న‌సు ఆంటి.. షాక్‌లో నెటిజ‌న్స్

ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ప్ర‌సారం అయ్యే గుప్పెడంత మ‌న‌స్సు సీరియ‌ల్‌కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో ప్ర‌ధాన పాత్రదారుడికి త‌ల్లి పాత్ర‌లో చాలా సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క‌నిపించి మంచి పేరు తెచ్చుకుంది జ్యోతిరాయ్. జ‌గ‌తి పాత్ర‌లో ఆమెకి చాలా మంది క‌నెక్ట్ అయిపోయారు. ఇక సీరియ‌ల్ ద్వారా చాలా మందికి క‌నెక్ట్ అయిన ఈ అమ్మ‌డు త‌న ఫాలోయింగ్ మ‌రింత పెంచుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. సీరియ‌ల్‌లో క‌నిపించే లుక్‌కి, సోష‌ల్ మీడియాలో క‌నిపించే లుక్‌కి ఏ మాత్రం పొంత‌నే లేకుండా పోయింది. జ్యోతిరాయ్ ఫొటోల‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతుంటారు. ఘాటు అందాల‌తో హీటెక్కించ‌డం ఈ అమ్మ‌డి స్పెషాలిటి.

సీరియల్ లో ఏజ్ ఎక్కువ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌డంతో జ్యోతిరాయ్ వ‌య‌స్సు 40 వ‌ర‌కు ఉంటుంద‌ని అందరు అనుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె రియ‌ల్ ఏజ్ ఎంత అనేది ఎవరికి తెలియ‌దు. ఎవ‌రికి వారు ఊహ‌లోచ‌న‌లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించింది. ఇన్ స్టాలో అభిమానులతో కనెక్ట్ అయిన ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలో ‘మీ వయస్సు ఎంతో చెప్పగలరా’ అని ఫ్యాన్స్ అడగ్గా.. పాన్ కార్ట్‌పై ఉన్న త‌న రియ‌ల్ డేట్ ఆఫ్ బ‌ర్త్‌ని చూపించింది. 1994లో తాను జ‌న్మించిన‌ట్టు చెప్ప‌డంతో ఆమె వయస్సు 30 ఏళ్లే అని అర్ధ‌మైంది. ఇక ఇది తెలుసుకొని అంద‌రు షాక్ అవుతున్నారు.

ఇన్నాళ్లు జ్యోతిరాయ్ కి వ‌య‌స్సు ఎక్కువే ఉంటుందని అంతా భావించారు. ఇక ఇప్పుడు తనే క్లారిటీ ఇవ్వ‌డం, చిన్న వయస్సు కావడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్ర‌స్తుతం జ్యోతిరాయ్ ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ‘నో మోర్ సీక్రెట్’.. మూవీతో పాటు ప్రెట్టీ గార్ల్ అనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. అలాగే ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతోనూ అలరించబోతోంది. ఇక స్టార్ హీరో మూవీ అవ‌కాశం కూడా ఈ అమ్మ‌డికి దక్కింద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఆ సినిమాలో ఈ అమ్మ‌డికి నిజంగా అవ‌కాశం దక్కితే కెరీర్ మాములు మ‌లుపు తిర‌గ‌దు. రానున్న రోజుల‌లో ఈ అమ్మ‌డు ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు