శరత్‌బాబుతో బిడ్డని కనాలని అనుకున్నా.. సినిమా అవకాశాల కోసం వారి కోరిక తీర్చా

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయి చేరుకోవాలని ఎన్నో కలలు కంటారు. కొందరు చివరి వరకు కృషి చేస్తుంటారు. కాని పరిస్థితులలో ఊహించని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే సీనియర్ నటి జయలలిత తన 40 ఏళ్ల సినీ రంగంలో ఎన్నో కష్టాలు పడి సినిమా అవకాశాల కోసం తాను కొందరు దర్శక నిర్మాతల కోరిక కూడా తీర్చనట్టు పేర్కొంది. కొంతమంది నుంచి తప్పించుకోగలిగినా మరికొంత మంది నుంచి మాత్రం తప్పించుకోలేకపోయానంటూ జయలలిత తెలియజేసింది. చక్కని అందం, అభినయం ఉన్న జయలలిత మొదట్లో హీరోయిన్‌గా నటించిన ఆ తర్వాత మాత్రం అన్ని రకాల క్యారెక్టర్లలో నటించేది. ఈమె ఎక్కువగా శృంగార, హాస్య పాత్రలను పోషించడంతో ఫేమస్ అయింది.
జయలలిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశానని…. ఒక రోజు డైరెక్టర్ గదికి రమ్మని పిలిచాడని, నో అంటే సినిమా నుండి తీసేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. అయిన నేను నో చెప్పడంతో నిజంగానే సినిమా నుండి తీసేసాడు. ప్యాకప్ అయిన తర్వాత అర్ధరాత్రి తన గదికి పురుషులు వచ్చి ఇబ్బంది పెట్టేవారని కూడా తెలియజేసింది. ఇక కొందరు నిత్యం ఫోన్ లు చేస్తూ ఉండేవాళ్లు , ఫోన్ తీయకపోతే కొందరు తలుపులు బాదే వాళ్లు. ఇలా ఎందరో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ఆ సమయంలో కొందరి నుండి తప్పించుకున్నా మరి కొందరి నుండి మాత్రం తప్పించుకోలేకపోయాను.
నేను తలుపులు తీయకోపోతో ఇక్కడే ఉరి వేసుకుంటామని కూడా కొందరు బెదిరించారు. సినిమా అవకాశాల కోసం నేను కూడా వారి అవసరాలు తీర్చాల్సి వచ్చింది. నా జీవితం నాశనం అయినా నా వాళ్లు బాగుండాలనే ఉద్దేశంతోనే పలువురితో పడక పంచుకున్నట్లు చెప్పింది జయలలిత. శరత్ బాబు, తాను ప్రేమించుకున్నామని చెప్పిన జయలలిత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఓ బిడ్డని కనాలని కూడా అనుకున్నా. కాని తమ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపేశారు. ఈ విషయం ఇంతవరకు ఎక్కడ చెప్పలేదని జయలలిత స్పష్టం చేసింది. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు కాబట్టి సీక్రెట్ రివీల్ చేశానని జయలలిత తెలియజేసింది. ఇప్పుడు ఆమె పలు సీరియల్స్ లో కూడా కనిపించి సందడి చేస్తుంది.