సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన అఖిల్.. కాని చేతికి అంత పెద్ద కట్టుతో కనిపించేసరికి అంతా షాక్

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేశాడు. అయినప్పటికీ ఏ చిత్రం కూడా పెద్ద విజయం సాధించలేదు. అన్ని చిత్రాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించాయి. హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ కనిపించింది లేదు. అయితే సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అఖిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సలార్ బ్లాక్ బస్టర్ అయినందుకు హోంబాలే ఫిలిమ్స్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. హీరో ప్రభాస్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరు కాగా, ఇక్కడ సినిమా టోన్ కు తగ్గట్టు అందరూ నల్లని దుస్తుల్లో రావడం గమనార్హం. చాలా మంది సతీసమేతంగా ఈ పార్టీకి హాజరై సందడి చేశారు.
ఇక ఈ వేడుకలలో అఖిల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా వెరైటీగా తలకు బ్యాండ్ పెట్టుకుని, భుజం చుట్టూ వార్మ్ క్లాత్ లాంటిది కప్పుకుని సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఇలా అఖిల్‌ని చూసి సలార్ 2లో అఖిల్ నటిస్తున్నాడేమొ అంటూ కొందరు చర్చలు మొదలు పెట్టారు. మరోవైపు అఖిల్ ఎడమ చేతికి పెద్ద గాయం అయ్యినట్లు కనిపిస్తుంది. చేతికి సిమెంట్ కట్టు కలిగి ఉండడం చూసి అక్కినేని ఫ్యాన్స్.. అసలు అఖిల్‌కి ఏమైంది..? సలార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ఏమన్నా గాయపడడ్డాడా అని ఆరాలు తీస్తూ తొందరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అఖిల్.. ప్రభాస్ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ సినిమాకి రామ్ చరణ్ కూడా సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటూ టాక్. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ రాలేదు కాని, ఈ మూవీ షూటింగ్ అఖిల్ సైలెంట్‌గా జరిపిస్తున్నారా, ఆ మూవీ షూటింగ్‌లోనే అఖిల్ గాయపడ్డాడా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్ తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేసినప్పటికి మంచి ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు కూడా నిరాశపరిచాయి.