Agent | అయ్యగారి నెత్తిమీద ఎంత బరువు పెట్టారంటే..?

Agent విధాత‌, సినిమా:  అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన సినిమా ‘ఏజెంట్’. (Agent) స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించారు. ఈ […]

Agent | అయ్యగారి నెత్తిమీద ఎంత బరువు పెట్టారంటే..?

Agent

విధాత‌, సినిమా: అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన సినిమా ‘ఏజెంట్’. (Agent) స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు.. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారికి హిట్ అంత అవసరం మరి.

ఇక విషయంలోకి వస్తే.. ‘ఏజెంట్’ సినిమాకు సంబంధించి అయ్యగారి నెత్తిమీద భారీగానే బరువు పెట్టినట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. ఈ బరువును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి.. పర్లేదు అనే టాక్ వచ్చినా.. అఖిల్ హిట్ కొట్టినట్లే. ఇంతకీ ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే..

ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు (షేర్స్‌లో):
నైజాం: రూ. 10 కోట్లు
సీడెడ్: రూ. 4.5 కోట్లు
ఆంధ్ర: రూ. 14.80 కోట్లు
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 3.80 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.10 కోట్లు

మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్ రూ. 36.20 కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 37 కోట్లకు పైగా రాబట్టాలి. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఏమంత పెద్ద కష్టం కాదని అనిపిస్తున్నా.. ప్రస్తుతం బుక్ మై షోలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్నంతగా అయితే లేవు. ఈ బుకింగ్స్ పెరగాలంటే విడుదల రోజు టాక్ బీభత్సంగా ఉండాలి.

అప్పుడు మాత్రమే ప్రేక్షకులని ఈ ఏజెంట్ థియేటర్లకి రప్పించగలడు.. లేదంటే మరో సినిమా అఖిల్ ఖాతాలో చేరినట్లే. అఖిల్ లాస్ట్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 21 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ లెక్కన చూస్తే.. అఖిల్ నెత్తిమీద ‘ఏజెంట్’ రూపంలో గట్టిగానే భారం పెట్టారని చెప్పుకోవచ్చు. చూద్దాం.. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ఏజెంట్ ఏం చేయబోతున్నాడో..?